Pawan Kalyan: పవన్ కు జోడీగా చరణ్ హీరోయిన్ ఎంపికైందా..?
- May 27, 2021 / 03:02 PM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో గబ్బర్ సింగ్ సినిమా అభిమానులకు ఎంతో ప్రత్యేకమనే సంగతి తెలిసిందే. పవన్ కు వీరాభిమాని అయిన హరీష్ శంకర్ ఫ్యాన్స్ పవన్ ను ఏ విధంగా చూడాలని అనుకుంటారో గబ్బర్ సింగ్ సినిమాలో అదే విధంగా చూపించడం గమనార్హం. గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ కానుండటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి చాలా సమయమే ఉంది.
అయితే పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమాకు హీరోయిన్ కూడా ఫైనల్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తున్న పూజా హెగ్డే పవన్ హరీష్ మూవీలో హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన వస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా పేరు కూడా వినిపిస్తున్నా పూజా హెగ్డే నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.

మరోవైపు ఈ సినిమాలో పవన్ రెండు పాత్రల్లో కనిపించనున్నారని ఒక పాత్రలో పవన్ లెక్చరర్ రోల్ లో నటిస్తుండగా మరో పాత్రలో ఐబీ ఆఫీసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ పవన్ కోసం ప్రత్యేకంగా ఒక కాలేజ్ సెట్ ను భారీ బడ్జెట్ తో వేయిస్తున్నట్టు సమాచారం. రీఎంట్రీలో పవన్ భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ఉండటం గమనార్హం. మరోవైపు పవన్ ఒక్కో సినిమాకు రికార్డు స్థాయిలో 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!














