యాంగ్రీ యంగ్ మేన్ నుంచి యాంగ్రీ స్టార్ గా మారిన తర్వాత రాజశేఖర్ సినిమాల ఎంపిక మంచి మార్పు వచ్చింది. తన వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకోవడంతోపాటు.. రొట్ట కమర్షియల్ సినిమాలు కాకుండా కాస్త కంటెంట్ ఉన్న సినిమాలవైపుకు మళ్ళారు రాజశేఖర్. ఆయన మునుపటి చిత్రం “కల్కి” కమర్షియల్ గా ఫెయిలైనా రాజశేఖర్ లోని కొత్త యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇక రీసెంట్ గా కరోనా నుంచి బయటపడిన రాజశేఖర్ రెండు కొత్త సినిమాలు ఎనౌన్స్ చేశారు. మలయాళ చిత్రం “జోసెఫ్” రీమేక్ “శేఖర్” మరియు “గతం” అనే సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న బృందంతో ఒక సినిమా.
ఈ రెండు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు. ముందుగా మొదలవ్వనున్న “శేఖర్” సినిమాకి హీరోయిన్ ను ఫైనల్ చేశారు. “జార్జ్ రెడ్డి” చిత్రంలో ద్విపాత్రాభినయం పోషించిన యువ నటి ముస్కాన్ ను మెయిన్ హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ఆ సినిమాలో ఆమె పాత్ర కంటే “వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డు” పాట ఆమె పెర్ఫార్మెన్స్ బాగా క్లిక్ అయ్యింది. ఆ పాటలో ఆమె పెర్ఫార్మెన్స్ చూసే ముస్కాన్ ను హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారు.
ఇకపోతే.. గతం మేకర్స్ తో రాజశేఖర్ చేయనున్న సినిమాలో ఆయన కుమార్తె శివాని కూడా ఓ కీలకపాత్ర పోషించనుందని తెలుస్తోంది. శివాని తెలుగు డెబ్యు “2 స్టేట్స్” ఆగిపోవడం, ఆమెకు మరో మంచి సినిమా దొరక్కపోవడంతో ఆమెను హీరోయిన్ గా సెటిల్ చేసే బాధ్యతను రాజశేఖర్ తీసుకున్నాడు.
Most Recommended Video
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!