Poonam Bajwa: ప్రియుడి ఫోటోని షేర్ చేసిన నటి పూనమ్ బజ్వా?

పూనం బజ్వా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఈమె హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అందం అభినయం మంచి నటన నైపుణ్యం ఉన్నటువంటి ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హీరో నవదీప్ తో కలిసి నటించిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేదు. అయితే ఈ సినిమాలో ఈమె నటనకు మాత్రం ప్రశంసలు అందాయి. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా ఏ సినిమా కలిసి రాలేదనే చెప్పాలి.

ఇలా ఎంతో అందం నటన నైపుణ్యం ఉన్నప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో తనకు అదృష్టం కలిసి రాకపోవడంతో పూర్తిగా తెలుగు తెరకు దూరమయ్యారు. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్ చేసినప్పటికీ తనకు గుర్తింపు రాకపోవడంతో తెలుగు తెరకు దూరమయ్యారు. తెలుగులో కాకుండా ఇతర భాషలలో ఈమె వరుస సినిమా అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. ఈ విధంగా అగ్ర తారగా గుర్తింపు పొందిన పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్దఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈమె తన అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ ఉంటారు. తాజాగా అభిమానులతో ఆస్క్ మీ అంటూ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఈమెను ప్రశ్నిస్తూ ఇప్పటివరకు మీరు ఒంటరిగా ఎలా ఉంటున్నారని ప్రశ్నించారు. నెటిజన్ ఈ విధంగా తనని ప్రశ్నించడంతో ఈమె ఏకంగా తన ప్రియుడుతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ తాను ఒంటరిగా లేనని,

తాను ప్రేమలో ఉన్నాను అనే విషయాన్ని వెల్లడించారు.ఇలా ప్రియుడి ఫోటో షేర్ చేయడంతో ఒక్కసారిగా నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈమె ప్రియుడు ఫోటోని షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Share.