Sai Dharam Tej: ‘గాంజా’ పక్కన పెట్టి.. అతనికి ఛాన్స్ ఇస్తున్న మెగా మేనల్లుడు..!
- April 26, 2024 / 12:58 PM ISTByFilmy Focus
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) .. సారి సారి సాయి దుర్గా తేజ్.. గతేడాది 2 సినిమాలు చేశాడు. ఒకటి ‘విరూపాక్ష’, ఇంకోటి ‘బ్రో'(Bro) . ఇందులో ‘విరూపాక్ష’ (Virupaksha) పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ తన మేనమామ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో చేసిన ‘బ్రో’ మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. మరోపక్క స్నేహితుడు నవీన్ కోసం ‘సత్య’ అనే షార్ట్ ఫిలింలో నటించాడు తేజు. అక్కడి వరకు ఓకే. కానీ 2024 స్టార్ట్ అయ్యి 4 నెలలు పూర్తికావస్తోన్నా ఇంకా నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లలేదు తేజు.
సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో ‘గాంజా శంకర్’ చేయాలి. నాగ వంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. కానీ బడ్జెట్ సమస్యల వల్ల ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం డిలే అవుతుంది. ఇంకో పక్క పూర్తిగా ఈ ప్రాజెక్టు ఆగిపోయింది అనే వాదన కూడా నడుస్తోంది. ఏదేమైనా ఇప్పట్లో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదు.

దీంతో సాయి దుర్గా తేజ్ ఇప్పుడు ఓ నూతన దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. అవును రోహిత్ అనే నూతన దర్శకుడికి సాయి దుర్గా తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ‘హనుమాన్’ (Hanu Man) తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన ‘ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్’ అధినేత నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.















