Heroine: వీడియో వివాదం… పోలీసులను ఆశ్రయించిన నటి?

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వారిలో నటి షేర్లిన్ చోప్రా ఒకరు. తక్కువ సినిమాలలో నటించిన పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేసే ఈమెకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇలా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె తాజాగా తనని చంపేస్తానని బెదిరిస్తున్నారు అంటూ పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశారు. ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త తనని వేధిస్తున్నాడని తన నుంచి తనకు ప్రాణహాని కూడా ఉంది అంటూ ఈమె పోలీసులను ఆశ్రయించారు.

అసలు చంపేస్తామని బెదిరించడానికి గల కారణం ఏంటి.. అనే విషయానికి వస్తే..గత కొద్ది నెలల క్రితం ఈమె ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నారట. ఓ వీడియో రికార్డింగ్ చేసే విధంగా తాను ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని కారణాలవల్ల నటి షేర్లిన్ చోప్రా వీడియో రికార్డింగ్ చేయలేకపోయారు దాంతో ఆమె తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇవ్వడానికి ఓకే చెప్పినా కూడా సదరు వ్యాపార వేత్త వినకుండా తనని విసిగిస్తున్నాడని, ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఈమె ఆరోపణలు వ్యక్తం చేశారు.

వీడియో రికార్డింగ్ చేసి ఇవ్వకపోతే తనని చంపేస్తానని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని తెలిపారు. ఇలా తన నుంచి ప్రాణహాని ఉందని ఈమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నటి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 506,354, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు.

ఇక ప్రస్తుతం (Heroine) ఈమె నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ ఫోటోషూట్లు చేయడం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటారు ఇక తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఈ వార్తల్లో నిలుస్తూ సంచలనంగా మారారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus