ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది అని అంతా అంటుంటారు. సినీ పరిశ్రమలో ఎక్కువ కాలం రాణించాలి అంటే గ్లామర్,టాలెంట్ ఉంటే సరిపోదు..! ప్రేక్షకులను మెప్పించగలగాలి…అలాగే అదృష్టం కూడా కలిసి రావాలి. ఛార్మి లాంటి హీరోయిన్ కు టాలెంట్, గ్లామర్ ఉన్నా స్టార్ గా ఎదగలేకపోయింది. ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అనే విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ తమన్నా వంటి భామలు ఏకంగా 17 ఏళ్లుగా స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్నారు. ఫేడ్ అవుట్ అయిపోయింది అనే మాట రాకుండా.. ఇప్పటికీ ఆమె కోటి పైనే పారితోషికం రాబట్టుకుంటుంది. రకుల్ కూడా అంతే..! అయినా వీళ్లకు ఏదో ఒక మూల నుండి పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.
సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే..కొంతమంది హీరోయిన్లకు పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తే వాళ్ళ కెరీర్ కు బూస్టప్ దొరుకుతుందని అంతా భావిస్తారు.అదే మొదటి సినిమానే స్టార్ హీరోకు జోడీగా నటించే అవకాశం వస్తే…వాళ్ళ రేంజ్ ఇంకెలా ఉండాలి..! కానీ కొంతమంది భామలు ఒకటి, రెండు సినిమాలకే దుకాణం సర్ధేశారు. ఆ హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) అను మెహతా :
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆల్ టైం హిట్ మూవీ ‘ఆర్య’ తో ఈమె టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.ఇవివి సత్యనారాయణ గారు వాళ్ళ కొడుకులతో చేసిన ‘నువ్వంటే నాకిష్టం’ సినిమాలో నటించినా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు.
2) భాను శ్రీ మెహ్రా :
అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోకు జోడీగా ‘వరుడు’ సినిమాలో నటించిన ఈ భామ కూడా రెండో సినిమా ‘అల ఎలా?’ తో దుకాణం సర్దేసినట్టయ్యింది. తర్వాత ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో నటించినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు.
3) అమ్రితా రావు :
మహేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అతిథి’ చిత్రం ద్వారా ఈమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ టాలీవుడ్లో కనిపించలేదు.
4) కృతి సనన్ :
ఈ బ్యూటీ మహేష్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా ప్లాప్ అవ్వడం తర్వాత వచ్చిన ‘దోచేయ్’ కూడా డిజాస్టర్ అవ్వడంతో ఈమె అడ్రస్ లేకుండా పోయింది.అయితే ఇప్పుడు ప్రభాస్ తో ‘ఆదిపురుష్’ లో నటించింది. కానీ అది బాలీవుడ్ సినిమా..! తెలుగు సినిమా అని చెప్పలేము.
5) బిపాసా బసు :
మహేష్ బాబుతో ‘టక్కరి దొంగ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ బ్యూటీ. కానీ ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్ళీ టాలీవుడ్ వైపు చూడలేదు.
6) లిసా రాయ్ :
మహేష్ బాబు నటించిన ‘టక్కరి దొంగ’ తోనే ఈమె కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈమెది కూడా సేమ్ పరిస్థితి.
7) తనిషా ముఖర్జీ :
ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో నటించిన ‘కంత్రి’ లో ఈమె ఓ హీరోయిన్ గా నటించింది. తర్వాత ఈమె టాలీవుడ్ వైపు చూడలేదు. ఈమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ చెల్లెలు అన్న సంగతి తెలిసిందే.
8) సారా జైన్ :
‘పంజా’ చిత్రంతో ఈమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్ళీ టాలీవుడ్ వైపు చూడలేదు.
9) అంజలి లవానియా :
‘పంజా’ సినిమాతోనే ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ సినిమా ప్లాప్ అవ్వడంతో అడ్రస్ లేకుండా పోయింది.
10) అన్షు :
నాగార్జున నటించిన ‘మన్మధుడు’ మూవీతో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘రాఘవేంద్ర’ చేసిన అది ఫ్లాప్ అయ్యింది. మిస్సమ్మ సినిమాలో గెస్ట్ రోల్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది.
11) కంగనా రనౌత్ :
ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏక్ నిరంజన్’ తో ఈమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. కానీ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్ళీ ఈమె టాలీవుడ్ వైపు చూడలేదు.
12) కరిష్మా కోటక్ :
‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ సినిమా ప్లాప్ అయ్యాక మళ్ళీ టాలీవుడ్ సినిమాల్లో కనిపించలేదు.
13) ప్రీతి జింటా :
వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా, మహేష్ బాబుతో రాజకుమారుడు వంటి హిట్ సినిమాల్లో నటించినా ఈమెకు టాలీవుడ్లో సరైన గుర్తింపు రాలేదు. తర్వాత ఈమె టాలీవుడ్లో రూపొందిన ఏ సినిమాలోనూ కనిపించలేదు.
14) కత్రినా కైఫ్ :
వెంకటేష్ తో మల్లీశ్వరి, బాలకృష్ణతో అల్లరి పిడుగు వంటి బడా సినిమాల్లో నటించినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు.
15) నేహా శర్మ :
రాంచరణ్ డెబ్యూ మూవీ ‘చిరుత’ తో లాంచ్ అయినప్పటికీ ఈ భామకి కలిసొచ్చింది ఏమీ లేదు. ఆ తర్వాత వరుణ్ సందేశ్ తో ‘కుర్రాడు’ అనే సినిమా చేసింది. అది ప్లాప్ అవ్వడంతో మళ్ళీ టాలీవుడ్ లో కనపడలేదు.
16) శ్రద్ధా కపూర్ :
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సాహో’ తో ఈమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ఈమె తెలుగులో కనిపించింది లేదు.