Hey Taara Song: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఫస్ట్ సింగిల్ రివ్యూ.!

‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు యంగ్ హీరో నిఖిల్ (Nikhil Siddhartha) . సుధీర్ వర్మ (Sudheer Varma)  ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో వీరి కాంబినేషన్లో ‘స్వామి రారా'(Swamy Ra Ra) , కేశవ (Keshava)  వంటి సినిమాలు వచ్చాయి. ఆ రెండూ బాగానే ఆడాయి. దీంతో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ క్రేజీ ప్రాజెక్టుగా మారింది. ‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో మెప్పించిన రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ఈ చిత్రంతో టాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతుంది. ఈమెతో పాటు ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik) కూడా మరో హీరోయిన్ గా కనిపించనుంది.

Appudo Ippudo Eppudo

‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 8న విడుదల కానుంది ఈ చిత్రం. టీజర్ అయితే బాగానే ఉంది. తాజాగా ఫస్ట్ సింగిల్ ను కూడా యూట్యూబ్ లో వదిలారు. ‘హే తార’ అంటూ సాగే ఈ మెలోడీకి కార్తీక్ బాణీలు అందించాడు. కృష్ణ చైతన్య లిరిక్స్ అందించగా నిత్యశ్రీ, కార్తీక్..లు ఆలపించారు. హీరో, హీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ ఇది అని స్పష్టమవుతుంది.

హీరో , హీరోయిన్ల మధ్య సాగే రొమాన్స్ ను కృష్ణ చైతన్య ఎంతో అందంగా వర్ణించాడు. లిరిక్స్ బాగున్నాయి. సింగర్స్ నిత్యశ్రీ, కార్తీక్..లు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి పాడారు. వినడానికి ప్లెజెంట్ గా ఉంది ఈ పాట.దర్శకుడు సుధీర్ వర్మకి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. ఈ పాట కూడా అతని టేస్ట్ కి తగ్గట్టే ఉంది అని చెప్పాలి. కొన్ని విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ లిరికల్ సాంగ్ ను మీరు కూడా చూస్తూ వినండి :

ఈ ఫేక్ స్ట్రాటెజీలు ఎందుకు ‘పుష్ప’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus