Pushpa 2: ఈ ఫేక్ స్ట్రాటెజీలు ఎందుకు ‘పుష్ప’

  • October 17, 2024 / 07:48 PM IST

అల్లు అర్జున్ (Allu Arjun)  – సుకుమార్ (Sukumar)  ..ల ‘పుష్ప 2’ (Pushpa 2) పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది కాదనడానికి లేదు.. నిజమే..! ‘పుష్ప’ బాగా ఆడింది కాబట్టి.. సహజంగానే ‘పార్ట్ 2’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కచ్చితంగా ‘పుష్ప 2’ ఖాతాలో కొన్ని రికార్డులు అయితే చేరతాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ‘పుష్ప 2’ టీం అత్యాశల వల్ల.. ఆ హైప్ కి కూడా గండం ఏర్పడేలా కనిపిస్తుంది. అవును.. డిసెంబర్ 6న రిలీజ్ కాబోతున్న ‘పుష్ప 2’ పై బజ్ పెంచడానికి.. టీం చిత్ర విచిత్రమైన స్ట్రాటెజీలు ప్లే చేస్తున్నట్లు స్పష్టమవుతుంది.

Pushpa 2

‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా రూ.365 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పెద్ద రేంజ్లో సక్సెస్ అయ్యింది లేదు. ఆంధ్రాలో నష్టాలు వచ్చాయి. తెలంగాణాలో కూడా బయ్యర్స్ జస్ట్ గట్టెక్కారు అంతే..! నార్త్ లో మాత్రం ‘పుష్ప’ భారీగా కలెక్ట్ చేసింది. మెయిన్ గా అక్కడ మాస్ సెంటర్స్ లో ‘పుష్ప’ చిత్రాన్ని అమితంగా వీక్షించారు. ఓవర్సీస్, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా జస్ట్ ఓకే అనే విధంగా కలెక్ట్ చేసింది. మొన్నామధ్య పక్క దేశాల్లో విడుదల చేస్తే.. అక్కడ ప్లాప్ అయ్యింది.

‘పుష్ప’ గురించి అందరూ గ్రహించాల్సిన నిజాలు ఇవే. కానీ మేకర్స్ మాత్రం.. ‘పుష్ప’ పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ కొట్టింది అని అనౌన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళ సినిమాని ఎలా అయినా పబ్లిసిటీ చేసుకోవచ్చు. అందులో కూడా తప్పులేదు. అది పక్కన పెడితే మొన్నటికి మొన్న హిందీ బెల్ట్ లోనే.. ‘పుష్ప’ కి రూ.275 కోట్లు బిజినెస్ జరిగినట్లు మేకర్స్ .. తమ పబ్లిసిటీ టీం ద్వారా ప్రకటించుకున్నారు. దానిపై ఆరా తీస్తే.. అది వాళ్ళు కోట్ చేసిన ప్రైజ్ అని తేలింది.

ఇప్పుడైతే ఏకంగా తమ సినిమాకి రూ.900 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు పబ్లిసిటీ చేయించుకుంటున్నారు. రిలీజ్ తర్వాత కలెక్షన్స్ పోస్టర్స్ ఎలాగూ రూ.1000 కోట్ల వరకు వెళ్తాయి. కానీ రిలీజ్ కి ముందు కూడా మా సినిమాకి రూ.500 కోట్లు, రూ.900 కోట్లు వచ్చాయనే ఫాల్స్ పబ్లిసిటీ ఎందుకు? ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యాక.. అనుకున్న కలెక్షన్స్ రాకపోతే.. ట్రోల్స్ ఓ రేంజ్లో వస్తాయి. అంతేకాదు ఇవన్నీ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న జెన్యూన్ ఒపీనియన్..ని కిల్ చేసే ప్రమాదం కూడా లేకపోలేదు కదా..! మరి ‘పుష్ప 2’ టీం ఉద్దేశం ఏంటో?

మంచు వారి ‘కన్నప్ప’.. డివోషనల్‌ రిలీజ్‌ డేట్‌ మీదే గురి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus