ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా ‘మిస్టర్ నూకయ్య’ వంటి డిఫరెంట్ మూవీని అందించిన దర్శకుడు అనిల్ కన్నెగంటి డైరెక్షన్లో రూపొందిన చిత్రం ‘హిడింబ’. ‘శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్’ (SVK సినిమాస్) బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ‘ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పకులుగా వ్యవహరించారు. ‘హిడింబ’ ట్రైలర్ బాగుంది. సినిమా పై అంచనాలు ఏర్పడేలా చేసింది. జూలై 20న రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది.
కానీ వర్షాల వల్ల.. సినిమా ఓపెనింగ్స్ పై దెబ్బ పడింది అని చెప్పాలి.కానీ మొదటి వారం స్టడీగా కలెక్ట్ చేసింది. 8వ రోజు కూడా ఓకే అనిపించింది.ఒకసారి 8 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.83 cr |
సీడెడ్ | 0.40 cr |
ఉత్తరాంధ్ర | 0.22 cr |
ఈస్ట్ | 0.16 cr |
వెస్ట్ | 0.11 cr |
గుంటూరు | 0.13 cr |
కృష్ణా | 0.12 cr |
నెల్లూరు | 0.07 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 2.04 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.32 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 2.36 cr (షేర్) |
‘హిడింబ’ (Hidimba) చిత్రానికి రూ.2.56 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రానికి రూ.2.36 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కి రూ.0.64 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
ఓ పక్కన ‘బేబీ’ మరో పక్క వర్షాల ఎఫెక్ట్ వల్ల ‘హిడింబ’ ఎక్కువ కలెక్షన్స్ ను సాధించలేకపోయింది. కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది. అయితే ఈరోజు ‘బ్రో’ ఇచ్చింది కాబట్టి.. ఇక కష్టమనే చెప్పాలి.
‘బ్రో’ మూవీ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు..!
‘బ్రో’ కి మిక్స్డ్ టాక్ రావడానికి కారణం ఈ 10 మైనస్సులేనట!