Nagarjuna: బిగ్ బాస్ వల్ల చిక్కుల్లో పడ్డ నాగార్జున ఏమైందంటే?

‘బిగ్ బాస్’ రియాలిటీ షో తెలుగులో కూడా సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. మొదటి సీజన్ ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. సెకండ్ సీజన్ ను నాని హోస్ట్ చేయడం జరిగింది. అయితే మూడో సీజన్ నుండి కింగ్ నాగార్జునే ఈ షోని హోస్ట్ చేస్తూ వస్తున్నారు. అంతకు ముందు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోని హోస్ట్ చేసిన అనుభవం ‘బిగ్ బాస్’ హోస్ట్ చేయడానికి నాగ్ కి బాగా ఉపయోగపడింది అని చెప్పాలి. కంటెస్టెంట్ల పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించి వారికి సలహాలు ఇవ్వడం, తప్పు చేస్తే మందలించడం నాగ్ పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. అందుకే గత 4 సీజన్ల నుండి నాగార్జునే బిగ్ బాస్ ని హోస్ట్ చేస్తూ వస్తున్నారు.

త్వరలోనే ఏడో సీజన్ ను కూడా ప్రారంభం కానుంది. నాగార్జునకి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఇంతలో షో యాజమాన్యానికి ఊహించని షాక్ తగిలింది. విషయంలోకి వెళితే.. బిగ్ బాస్ రియాలిటీ షో ఆరవ సీజన్ నడుస్తున్న టైంలో ఇందులో శృతి మించిన రొమాన్స్, అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయంటూ హైకోర్టులో కేసు నమోదైంది. సీపీఐ నారాయణ వంటి కొందరు నేతలు ఇది ‘బిగ్ బాస్ హౌసా.. బ్రోతల్ హౌసా’ అంటూ మండిపడ్డారు.

అయితే అప్పుడు వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఇప్పుడు విచారణ చేపట్టింది.ఈ క్రమంలో బిగ్ బాస్ షో ని నిలిపివేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ‘స్టార్ మా’ వారికి అలాగే హోస్ట్ నాగార్జునకి కూడా హైకోర్టు నోటీసులు పంపించి షాకిచ్చింది.దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కూడా న్యాయస్థానం అందులో పేర్కొంది. దీంతో ‘బిగ్ బాస్ 7 ‘ మరికొన్ని రోజుల పాటు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి అనే టాక్ వినిపిస్తోంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus