స్టార్ హీరో అయ్యుండి.. ఇదేంటి యష్..?

సాధారణంగా ఓ హీరోకి.. సినిమా హిట్టయ్యి మంచి క్రేజ్ వస్తే.. ఇక అతని పై ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువవుతుంది. ఇక ఆ హీరోకి సంబందించిన ప్రతీ విషయమూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ఇప్పుడు ఈ విషయం కన్నడ స్టార్ హీరో యష్ విషయంలో మరోసారి నిజమయ్యింది. వివరాల్లోకి వెళితే’కే.జీ.ఎఫ్’ చిత్రంతో ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకున్నాడు యష్ . అయితే అతని ఫ్యామిలీ… రెంట్ కట్టడం లేదని.. ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కోర్టును ఆశ్రయించిన యష్ కు నిరాశే మిగిలింది.

అసలు విషయం ఏమిటంటే.. యష్ ఫ్యామిలీ బనశంకరి ఏరియాలో ఒక ఇంట్లో 2010 నుండి నివాసం ఉంటూ వస్తున్నారు. ఇంటి అద్దె రూ.40 వేలు. అయితే 2013 నుండి వీరు రెంట్ కట్టడం లేదని ఇంటి ఓనర్లు సివిల్ కోర్టుని ఆశ్రయించారు. అయితే యష్ అమ్మగారు పుష్ప మాత్రం ఇంటి నిర్మాణ సమయంలో పన్నెండున్నర లక్షలు చెల్లించామని ఆ కారణంగానే ఇంటికి అద్దె ఇవ్వడం లేదని తెలిపారు. ఇంటి ఓనర్లు మాత్రం కిరాయి చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కోర్టు వారు పుష్పకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. దీంతో హైకోర్టుని ఆశ్రయించింది పుష్ప. ఇరు వాదనలు విన్న హైకోర్టు రూ.23 లక్షలు, ఈ మొత్తానికి వడ్డీని కూడా చెల్లించి పుష్ప.. ఇంటి ఓనర్ లకు చెల్లించాలని తీర్పునిచ్చింది. అంతేకాదు పుష్ప రీసెంట్ గా హౌస్ ఎవిక్షన్ నోటీసులు కూడా అందుకున్నారట. దీంతో ఆమె తనకి ఇంట్లో ఉండడానికి ఎక్స్ టెన్షన్ కావాలని సుప్రీం కోర్టుని ఆశ్రయించారని తెలుస్తుంది. ఈ విషయం పై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు యష్ ను ట్రోల్ చేస్తున్నారు. ‘నువ్వో స్టార్ హీరో అయ్యుండి కూడా ఈ రెంట్ వివాదాలు ఏంటి’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus