మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి పెద్ద షాక్ తగిలింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెచ్చుకున్న స్పెషల్ షోలు.. అంటే ఉదయం 8 గంటల షోలు క్యాన్సిల్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇది సినిమాకి పెద్ద దెబ్బె అని చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. ‘గేమ్ ఛేంజర్’ ప్రీమియర్ షోలకు, అర్ధరాత్రి 1 గంట షోలకు ప్రభుత్వం నిరాకరించిన సంగతి తెలిసిందే. టికెట్ రేట్ల హైక్స్ ఇచ్చి.. ఉదయం 4 గంటలు షోలు వేసుకోవచ్చని ప్రభుత్వం తీర్మానించింది.
తెలంగాణలో ‘గేమ్ ఛేంజర్’ మార్నింగ్ షోలు తెల్లవారుజామున 4 గంటల నుండి వేసిన సంగతి తెలిసిందే. అలాగే పది రోజుల వరకు స్పెషల్ షోలకు అనుమతినిచ్చింది తెలంగాణ ప్రభుత్వం.అంటే 10 రోజుల వరకు ఉదయం 8 గంటల షోలు వేసుకోవచ్చన్న మాట. అయితే దీన్ని సవాల్ చేస్తూ.. హైదరాబాద్ కి చెందిన కూరగాయల వ్యాపారి గొర్ల భరత్ రాజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ‘ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు కాదని.. స్పెషల్ షోలకి ఎలా అనుమతులిచ్చారు. 10 రోజుల పాటు వేసే స్పెషల్ షోలు కూడా బెనిఫిట్ షోలు వంటివే’ అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే మార్నింగ్ షోలు అదే స్పెషల్ షోలు క్యాన్సిల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకి.. రూ.250 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మరి అంత మొత్తం వెనక్కి రాబట్టాలంటే.. సంక్రాంతి సెలవులకి స్పెషల్ షోలు అందుబాటులో ఉండాలి. మరి ఆ షోలు క్యాన్సిల్ అవ్వడం అనేది ఆ సినిమాకు పెద్ద దెబ్బె కదా.