Guntur Kaaram Trailer: ‘గుంటూరు కారం’ ట్రైలర్ ఆ నెగిటివిటీకి ఫుల్-స్టాప్ పెడుతుందా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ పర్వాలేదు అనిపించినా… దమ్ మసాలా సాంగ్, ఓ మై బేబీ సాంగ్ , కుర్చీ మడతపెట్టి సాంగ్ ..సో సోగానే అనిపించాయి.

మరోపక్క జనవరి 12 నే ‘హనుమాన్’ అనే క్రేజీ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. దాని టీజర్, ట్రైలర్స్ అదిరిపోయాయి. బుక్ మై షోలో ఆ సినిమాకి ఎక్కువ ఇంట్రెస్ట్ లు కూడా నమోదయ్యాయి. దీంతో కొంతమంది ‘గుంటూరు కారం’ ని ట్రోల్ చేస్తుండటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయ్యి.. దానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే తప్ప ఈ ట్రోల్స్ ఆగవనే చెప్పాలి.

వాస్తవానికి ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ట్రైలర్ ని ప్రేక్షకులకి చూపించాలని మేకర్స్ భావించారు. కానీ కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోన్ అయ్యింది. దీంతో జనవరి 7వ తేదీన సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న ‘సుదర్శన్ 70 ఎంఎం’ థియేటర్లో ట్రైలర్ ని లాంచ్ చేసేందుకు చిత్ర బృందం రెడీ అయ్యింది. మరి ఈ ట్రైలర్ ‘గుంటూరు కారం’ సినిమాకు ఎలాంటి మైలేజ్ తీసుకొస్తుందో చూడాలి..!

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus