చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో ‘వీర ధీర శూర’ (Veera Dheera Soora) అనే సినిమా వచ్చింది. ‘సేతుపతి’ ‘చిన్నా’ వంటి విభిన్న కథా చిత్రాలని అందించిన ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఉగాది కానుకగా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్థిక లావాదేవీల కారణంగా మార్నింగ్ షోలు, మ్యాట్నీలు క్యాన్సిల్ అయ్యి.. ఈవెనింగ్ షోలతో రిలీజ్ అయ్యింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.
Veera Dheera Soora Collections:
ఒక రాత్రిలో జరిగే కథ ఇది. 30 ఇయర్స్ పృథ్వీ విలనిజం కూడా ఆడియన్స్ కి కొత్త ఫీల్ ఇచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలబడలేకపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘వీర ధీర శూర’ (Veera Dheera Soora) చిత్రానికి రూ.3.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.6 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.1.4 కోట్లు షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా రూ.2.40 కోట్లు వచ్చింది. పోటీగా ‘ఎల్ 2 : ఎంపురాన్’ ‘మ్యాడ్ స్క్వేర్’ ‘రాబిన్ హుడ్’ వంటి సినిమాలు ఉండటం, వీక్ ప్రమోషన్స్ కారణంగా ఈ సినిమా ప్లాప్ గా మిగిలిపోయింది అని చెప్పాలి.