రవితేజ డిస్కో రాజాలో హైలెట్ పాయింట్ అదేనట..!

మాస్ మహారాజ్ రవితేజ నటించిన డిస్కో రాజా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 18న గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. కాగా ఈ సీనియర్ హీరో ఓ రేంజ్ హిట్ కొట్టి చాలా రోజులవుతుంది. ఈ మధ్య ఆయన నటించిన రాజా ది గ్రేట్ ఒక మోస్తరు హిట్ అందుకోగా ఆతరువాత వచ్చిన టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోని పరాజయం పాలయ్యాయి. దీనితో డిస్కో రాజాపై ఈయన చాలా ఆశలు పెట్టుకున్నారు.

దర్శకుడు వి ఐ ఆనంద్ సైంటిఫిక్ ఫిక్షనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. చిత్ర టీజర్ తో మూవీ కథపై కొంత హింట్ ఇచ్చారు దర్శకుడు. ఐతే లేటెస్ట్ సమాచారం ప్రకారం ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని రవితేజ పై ఒక శాస్త్రవేత్తల బృందం ప్రయోగం నిర్వహిస్తారట. ఆ ప్రయోగం వికటించడంతో రవితేజ వైవిధ్యమైన ప్రవర్తన కలిగిన కిల్లింగ్ మిషన్ లా తయారవుతాడట. ప్రయోగానికి ముందు ఒకలా ప్రయోగం తరువాత ఒకలా ప్రవర్తించే రవితేజ నటన ఈ చిత్రనికి హైలెట్ గా నిలుస్తుందని సమాచారం.

డిస్కో రాజా టైటిల్ లో బటర్ ఫ్లై సిబల్ వెనుక కారణం కూడా సింబాలిక్ గా రవితేజ పాత్రను తెలియజేయడమే అని వినికిడి. తెరపై తన ఎనర్జీతో విరుచుకుపడే రవితేజ, రెండు భిన్న షేడ్స్ కలిగిన పాత్రలో చెలరేగడం ఖాయంగా కనిపిస్తుంది. డిస్కో రాజా చిత్రంలో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తళ్లూరి నిర్మిస్తున్నారు. డిస్కో రాజా చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus