Pushpa Movie: పుష్ప మూవీలో ఆకట్టుకునే అంశాలివేనా?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప పార్ట్1 రిలీజ్ కావడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో థియేటర్లలో పుష్ప రిలీజ్ కానుండగా ఇతర రాష్ట్రాలలో కూడా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో థియేటర్లను కేటాయించారని సమాచారం. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని బన్నీ కెరీర్ లోనే పుష్ప బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటిస్తుండగా దాదాపుగా 180 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. పుష్ప సినిమాలో కొన్ని సన్నివేశాలు హైలెట్ గా నిలవనున్నాయని ఆ సీన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని సమాచారం. ఇంటర్వెల్ సీన్ షాకింగ్ ట్విస్ట్ తో ఉండనుందని ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు కూడా అద్భుతంగా వచ్చాయని సమాచారం. సుకుమార్ కథనంతో మరోసారి మ్యాజిక్ చేయనున్నారని తెలుస్తోంది.

రిలీజ్ ముందు వినిపిస్తున్న టాక్ పాజిటివ్ గా ఉండటంతో పాటు ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ భారీస్థాయిలో జరుగుతున్నాయి. తొలి భాగంలో రష్మిక కనిపించే సీన్లు తక్కువేనని తెలుస్తోంది. మాస్ ప్రేక్షకులకు నచ్చేలా సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది. సుకుమార్ ఈ సినిమాతో రంగస్థలంను మించిన విజయం అందుకోవడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 101 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. మరోవైపు ఏపీలో టికెట్ రేట్లు పుష్ప మేకర్స్ ను టెన్షన్ పెడుతున్నాయి.

జగన్ సర్కార్ సింగిల్ జడ్జ్ తీర్పును సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లడంతో డివిజనల్ బెంచ్ తీర్పు ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. పుష్ప మేకర్స్ కోర్టులో అనుకూలంగా తీర్పు వస్తుందని నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం తగ్గించిన రేట్ల ప్రకారమే ఏపీలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. తగ్గించిన రేట్ల వల్ల అఖండ మూవీ నష్టపోగా పుష్ప విషయంలో ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus