‘లైగర్’ గా విజయ్ హంగామా : ప్రభాస్ తో దిశా పటాని రొమాన్స్ : బాలయ్యకు విలన్ గా బాలీవుడ్ హీరో

విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఛార్మీ,పూరి,కరణ్ జోహార్ లు కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ‘లైగర్’ టైటిల్ ను ఖరారు చేసినట్టు ప్రకటించారు చిత్ర యూనిట్ సభ్యులు. దాంతో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది.

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్’ అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఈ మధ్యే నిర్వహించారు. పాన్ ఇండియా మూవీగా ‘సలార్’ రూపొందుతోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దిశా పఠాని ఎంపికైనట్టు తాజా సమాచారం. అయితే దీని పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ మాస్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో విలన్ గా అప్పటి బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ఎంపికయ్యాడట. సినిమాలో వచ్చే కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో సునీల్ శెట్టి కనిపిస్తాడని సమాచారం.

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ‘వకీల్ సాబ్’, క్రిష్ మూవీలతో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్లో కూడా పవన్ సినిమాలు చెయ్యబోతున్నాడు. కాగా ఇప్పుడు సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో కూడా పవన్ ఓ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. రామ్ తాళ్లూరి నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించనున్నారట. 2021 ఎండింగ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.


Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus