Akhil: అఖిల్ అందుకే విన్నర్ అవ్వలేకపోతున్నాడా..? అసలు ఏం జరుగుతోంది..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ -1 అంతిమ దశకి చేరుకుంది. ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ కూడా జరిగిపోతోంది. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ జెర్నీలు చూపిస్తున్నాడు బిగ్ బాస్. అఖిల్ జెర్నీ చూసినప్పుడు చాలామంది అందులో బిందు హైలెట్ అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, బిందు జెర్నీ వీడియోలో కూడా నటరాజ్ మాస్టర్ హైలెట్ అయ్యారు. ఎవరితో అయితే వాళ్లకి టఫ్ ఫైట్ అనిపించిందో వాళ్లు జెర్నీలో హైలెట్ అవుతూ వచ్చారు. నిజానికి అఖిల్ జెర్నీలో అఖిల్ కి టఫ్ ఫైట్ ఇచ్చింది బిందునే.

అందుకే, అఖిల్ జెర్నీలో బిందు హైలెట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత బిందు జెర్నీ చూపించినపుడు కూడా అఖిల్ తో జరిగిన గొడవలు , నామినేషన్స్ లో వాగ్వివాదాలు అన్నీ కూడా రిపీట్ గా వచ్చినట్లుగానే అనిపించింది. దీన్ని బట్టీ చూస్తే ఇప్పుడు ఇద్దరిలో ఎవరు విన్నర్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ – 1 టైటిల్ బిందుని వరిస్తే ఖచ్చితంగా బిందు వల్లే అఖిల్ విన్నర్ అవ్వలేకపోయాడని చెప్పచ్చు. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

ఫినాలే ఎపిసోడ్ దాదాపుగా 4గంటల పాటు ప్లాన్ చేశారు. ఐదుగురుని ఎలిమినేట్ చేస్తూ, ఇద్దరిని ఎప్పటిలాగానే స్టేజ్ పైకి తీస్కుని వచ్చి విన్నర్ ని డిసైడ్ చేస్తారు. ఇందులో అఖిల్, ఇంకా బిందు ఇద్దరూ ఉంటారు. ఒకవేళ బిందు విన్నర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈసారి అఖిల్ గెలుపుకి ఆమె అడ్డువచ్చినట్లే అవుతుంది. లాస్ట్ టైమ్ సీజన్ – 4 లో అఖిల్ విజయానికి అభిజీత్ అడ్డు పడితే, ఈసారి బిందు అడ్డుపడుతోంది. కానీ, అఖిల్ టాస్క్ పరంగా లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ పెద్దగా పెర్ఫామ్ చేసింది లేదు.

అంతేకాదు, సోహైల్ కి – అఖిల్ కి ఉన్న ఫ్రెండ్షిప్ బాండ్ అనేది సీజన్ – 4లో హైలెట్ గా నిలిచింది. అందుకే, సోహైల్ డబ్బులు తీస్కుని వచ్చిన తర్వాత అఖిల్ రన్నరప్ గా నిలిచాడు. కానీ, ఇప్పుడు అఖిల్ సోలోగానే ఫినాలే వరకూ వచ్చాడు. విన్నింగ్ రేస్ లో ఉన్నాడు. ఫస్ట్ నుంచీ కూడా టైటిల్ ఫేవరెట్ గానే బరిలోకి దిగాడు. లాస్ట్ టైమ్ రన్నరప్ గానే మిగిలిపోయాను అని, ఈసారి విన్నర్ అవుతారని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

కానీ, మొదటి రెండు వారాల నుంచే బిందు మాధవి అఖిల్ ని టార్గెట్ చేసింది. ఎక్కడ లేని లాజిక్స్ ని అఖిల్ పై ప్రయోగించి నామినేషన్స్ లో పవర్ చూపించే ప్రయత్నం చేసింది. వీళ్లిద్దరి మద్యలో జరిగిన ఆర్గ్యూమెంట్ లో బిందు హైలెట్ అవుతూ వచ్చింది. యాంకర్ శివతో ఉన్న ఫ్రెండ్షిప్ అనేది బిందుకి ప్లస్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు అఖిల్ విన్నర్ అవుతాడా ? లేదా బిందు మాధవి విన్నర్ అవుతుందా అనేది సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది.

అన్ అఫీషియల్ పోలింగ్స్ లో బిందుకి ఓటింగ్ ఎక్కువగా ఉన్నా కూడా, ఇద్దరి మద్యలో కేవలం 2శాతం మాత్రమే తేడా ఉంది. అందుకే, ఎవరు విన్నర్ అవుతారు అనేది చెప్పలేని పరిస్థితి. ఒకవేళ అఖిల్ ఈసారి కూడా రన్నరప్ గా నిలిస్తే మాత్రం అఖిల్ ఫ్యాన్స్ చాలా డిస్సపాయింట్ అవుతారు. అదీ మేటర్.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus