Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ అమర్ దీప్ ని విన్నర్ ని చేస్తున్నాడా ? అసలు ప్లాన్ ఏంటంటే.,

బిగ్ బాస్ హౌస్ లో ఆఖరివారం విన్నర్ డిసైడ్ వారంగా మారింది. మొత్తం ఈసారి 6మంది హౌస్ మేట్స్ ఫినాలేలో జెర్నీలు చూడబోతున్నారు. ఇందులో మొదటగా అమర్ దీప్ జెర్నీని చూపించాడు బిగ్ బాస్. అమర్ దీప్ గురించి మంచి ఎలివేషన్ ఇస్తూ, స్క్రీన్ పైన యాక్టివిటీ రూమ్ లో దీపాల మద్యలో అమర్ దీప్ జెర్నీని చూపించాడు. ఫస్ట్ వెళ్లడమే అమర్ దీప్ తన మొమరీస్ ని, బిగ్ బాస్ లో తన జెర్నీ ఫోటోలని చూస్తూ వెళ్లాడు. అమర్ దీప్ జెర్నీ గురించి ఒక్కసారి చూసినట్లయితే., ఫస్ట్ నుంచీ కూడా జెంటిల్ మాన్ లా గేమ్ ఆడలేదు. ఫౌల్ గేమ్స్ ఆడుతూనే వచ్చాడు.

తనకి ఉన్న సీరియల్ ఫేమ్ ని సరిగ్గా వాడుకోలేకపోయాడు. మొదట్లో అంతా తింగరి తింగరిగానే గేమ్ ఆడాడు. సీజన్ 5లో వచ్చిన సన్నీని ఇమిటేట్ చేస్తూ ఆడాలని ప్రయత్నాలు చేశాడు. కానీ విఫలం అయ్యాడు. ప్రతి టాస్క్ లో ఫౌల్ గేమ్ ఆడటం, తన బుర్రకి తోచినట్లుగా ఆడుతూ అందరికీ లోకువ అయిపోయాడు. దీంతో అమర్ దీప్ కమెడియన్ అయ్యాడు. అయితే, ఇక్కడ చాలా సార్లు సారీలు చెప్పుకున్నాడు. వీకెండ్ అందరికంటే కూడా ఎక్కువగా నాగార్జున చేతిలో క్లాస్ లు పడింది అమర్ దీప్ కే.

అందుకే, శివాజీ ప్రతిరోజూ కూడా ఏదో ఒక విషయంలో అమర్ ని నిందిస్తూనే కామెడీగా సెటైర్స్ వేయడం మొదలు పెట్టాడు. ఇది చాలా దూరం కూడా వెళ్లింది. అమర్ ఫ్యాన్స్ కొంతమంది ఈవిషయంలో బాగా హర్ట్ అయ్యారు. నిజానికి బిగ్ బాస్ స్టార్టింగ్ లో సందీప్ చాలావారాలు నామినేషన్స్ లో తప్పించుకున్నా కూడా అమర్ దొరికిపోయాడు. తరుచుగా నామినేషన్స్ లోకి రావడం అనేది అమర్ కి ప్లస్ అయ్యింది. నిజానికి అమర్ జెర్నీలో సందీప్ ని చాలా కొద్దిగానే చూపించారు. అలాగే శివాజీ సెటైర్స్ వేసినవి, పోక్ చేసినవి చూపించలేదు. అమర్ బూతులు మాట్లాడినవి, పౌల్స్ ఆడినవి , నెగిటివ్ అయినవి కూడా ఏమీ చూపించలేదు.

నామినేషన్స్ అప్పుడు అమర్ దీప్ ఆర్గ్యూమెంట్స్, పల్లవి ప్రశాంత్ పై మాటలు విసిరినవి కూడా చూపించి, నాగార్జున రిగ్రేట్ మూమెంట్ చేసింది కూడా చూపించి ఉండాల్సింది. అది కంప్లీట్ గా జెర్నీలో మిస్ అయ్యింది. నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్ తో మంచి పేరు తెచ్చుకున్న అమర్ దీప్ బిగ్ బాస్ లో వేసిన డ్యాన్స్ క్లిప్స్ కూడా చూపించలేదు. లారెన్స్ వచ్చినపుడు స్టెప్స్ అదరగొట్టాడు ఆ బిట్స్ కూడా మిస్ అయ్యాయి. చాలా సందర్భాల్లో డ్యాన్స్ బాగా చేశాడు. అది మిస్ చేశాడు బిగ్ బాస్. హైయిర్ కట్ చేస్కోమని బిగ్ బాస్ ఆదేశించాడు చేస్కోలేదు ఆ తర్వాత దానిని వంకగా చూపించి నామినేట్ చేసినవి,

అలాగే అమర్ దీప్ నామినేషన్స్ లో అరిచినవి కట్ అయ్యాయి. కామెడీ మొత్తం హైలెట్ చేశారు. శివాజీతో కూడా ఉన్నది మంచి కట్స్ చూపించారు. ఈసారి బిగ్ బాస్ మొమరీస్ బుక్ పెట్టడం అనేది హైలెట్ అనే చెప్పాలి. సెట్టింగ్ చాలా బాగా వేశారు. లాస్ట్ వీక్స్ లో అందరి జెర్నీలు అయిన తర్వాత రీయూనియన్ చేసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత గ్రాండ్ ఫినాలే నడుస్తుంది. అయితే, అమర్ దీప్ జెర్నీ అనేది ముందుగా వేయడం అమర్ కి మంచి ప్లస్ అయ్యింది. ఓటింగ్ లో తన గ్రాఫ్ ని పెంచేందుకు ఇది చాలాబాగా ఉపయోగపడుతుంది. ఇదే బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) వేసిన మాస్టర్ ప్లాన్.

అలాగే, అర్జున్ జెర్నీ కూడా ఎపిసోడ్ లో చూపించారు. మద్యలో వచ్చినా మడతెట్టే గేమ్ ఆడాడు అర్జున్. అందరికీ టాస్క్ ల్లో భయం చూపించాడు. తన కటౌట్ చూసి అందరూ తలపడేందుకు భయపడ్డారు. ముఖ్యంగా ఫినాలే అస్త్ర సంపాదించడం అనేది అర్జున్ కి మంచి ప్లస్ పాయింట్ అయ్యింది. పల్లవి ప్రశాంత్ తో ఆర్గ్యూమెంట్స్, పాయింట్ లేకుండా తనని టార్గెట్ చేయాలని అనుకున్న మాటలు అర్జున్ కి మైనస్ అయ్యాయి. లేకుండా విన్నర్ మెటీరియల్ అయ్యేవాడు. ఇక శివాజీ, యావర్ జెర్నీలు హౌస్ లో ప్లే కాబోతున్నాయి. మరి వీటిలో ఎంతమంది కనెక్ట్ అయి ఓట్ వేస్తారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus