బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. అయితే, అందరూ అనుకున్నట్లుగా చీఫ్ గెస్ట్ గా మహేష్ బాబు రాలేదు. దీనికి కారణం ఏంటా అని ఆరాతీస్తే అనేక విషయాలు తెలుస్తున్నాయి. మహేష్ బాబు ముందుగా వస్తానని మాట ఇచ్చాడంట. కానీ, కొన్ని పర్సనల్ కారణాల వల్ల లేట్ అయిపోయిందనేది టాక్. లేట్ గా వస్తే, ఆల్రెడీ టెలికాస్ట్ ఒక పక్కన అయిపోతుంటే 7గంటలకి షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంది. అందుకే, నాగార్జునే సోలోగా విన్నర్ ని ఎనౌన్స్ చేసేసాడు. అంతేకాదు, అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూరా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, అమర్ దీప్ ఫ్యాన్స్ తో నిండిపోయింది.
ఈ క్రౌడ్ – మీడియా వాళ్ల వల్ల కూడా మహేష్ బాబు రాలేదనేది కారణంగా చెప్తున్నారు. ఈసారి మెగా ఫైనల్స్ కోసం చాలామంది ఆర్టిస్టుల డ్యాన్స్ పెర్ఫామన్స్ కూడా ప్లాన్ చేశారు. కానీ, ఏదీ జరగలేదు. అలాగే, ఓటీటీకి సంబంధించిన అంశాలు కూడా ఇంకా నిర్ణయించలేదు. అందుకే స్టేజ్ పైన ఎనౌన్స్ చేయలేదు. ఫైనల్ గా మహేష్ బాబు రాకపోవడంతో బిగ్ బాస్ టీమ్ చాలా డిస్సపాయింట్ అయ్యింది. అందుకే, లాస్ట్ లో స్టేజ్ పైన నాగార్జునే ట్రోఫీని అందించేశారు. గ్రాండ్ ఫినాలేలో చాలా హైలెట్స్ అయ్యాయి. వాటిని ఒక్కసారి చూసినట్లయితే.,
1. ఎలిమినేట్ అయిపోయిన హౌస్ మేట్స్ అందరూ కూడా డ్యాన్స్ పెర్ఫామన్స్ తో రెచ్చిపోయారు. సందీప్ – నయనీ పావనీ, శోభా – టేస్టీ తేజ, అశ్విని – భోలే ఇలా జంటలుగా చేసిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా భోలే కంపోజ్ చేసిన సాంగ్ హైలెట్ గా నిలిచింది.
2. తర్వాత హౌస్ మేట్స్ అందరూ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బయట తమకి వచ్చిన ఆఫర్స్, రెస్పాన్స్ నాగార్జునతో పంచుకున్నారు.
3. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 6గురు కంటెస్టెంట్స్ గ్రేస్ ఫుల్ డ్యాన్స్ తో రెచ్చిపోయారు. ఒక్కొక్కరు ఒక్కో సాంగ్ ని ప్రజెంట్ చేస్తూ తమ మార్క్ ని చూపించారు.
4. అందరికంటే కూడా అర్జున్ ఎలిమినేషన్ హైలెట్ గా జరిగింది. హౌస్ లోకి సుమ ఎంట్రీ ఇచ్చి జోకులు వేస్తూ, తనదైన స్టైల్లో పంచ్ లు వేస్తూ రెచ్చిపోయింది. అంతేకాదు, ఆకర్షణీయమైన రోబోని తీస్కుని వచ్చి ఫైర్ చేయిస్తూ అర్జున్ ని ఎలిమినేట్ చేశారు. అది అయితే సీజన్ కే హైలెట్ గా నిలిచింది.
5. ఇక మాస్ మహారాజా రవితేజ స్పషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ఈ సీజన్ లో రవితేజ ఇది రెండోసారి రావడం అయ్యింది. బిగ్ బాస్ స్టేజ్ పైకి వస్తూనే ఫుల్ ఎనర్జీతో కనిపించాడు. ఈగల్ టీజర్ ని అందరికీ చూపించాడు. అలాగే, అమర్ దీప్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అమర్ దీప్ కి తన నెక్ట్స్ సినిమాలో ఆఫర్ ఇచ్చాడు రవితేజ. కానీ, కాసేపు అమర్ తో ఆడుకున్నారు. ఆఫర్ కావాలంటే హౌస్ లో నుంచీ బయటకి వచ్చేయమని చెప్పారు. దీంతో అమర్ సై అంటూ గేట్ వరకూ వచ్చాడు. కానీ హోస్ట్ నాగార్జున నీకు ఆఫర్ పక్కా వెళ్లి కూర్చో అని చెప్పేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
6. రవితేజ వెళ్లిపోతూ ప్రియాంకని ఎలిమినేట్ చేసి వెళ్లిపోయారు. దీంతో టాప్ 5 స్థానంలో ప్రియాంక ఎలిమినేట్ అయ్యింది.
7. తర్వాత యావర్ సూట్ కేస్ తీస్కుని బయటకి రావడం అనేది సూపర్. రైట్ టైమ్ లో రైట్ డెసీషన్ తీస్కున్నాడు. తనకి పొజీషన్ అనేది తెలియనపుడు కళ్లముందు ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. శివాజీ – ప్రశాంత్ ఉంటే తనకి ఓట్స్ పడవని తనకి కూడా తెలుసు. అందుకే బయటకి వచ్చేశాడు. ఈవిషయంలో వాళ్ల అన్నయ్య కరెక్ట్ గా గైడ్ చేశాడు. డబ్బులు అవసరం అని తెలిసినపుడు సూట్ కేస్ తీస్కుని వచ్చేయడమే కరెక్ట్ అని యావర్ భావించాడు. అల్లరి నరేష్, ఇంకా రాజ్ తరుణ్ ఇద్దరూ యావర్ ని తీస్కుని బయటకి వచ్చేశారు.
8. కళ్యాణ్ రామ్ వచ్చిన తర్వాత శివాజీ ఎలిమినేషన్ కూడా ప్రోసెస్ అనేది బాగుంది. అయితే, పల్లవి ప్రశాంత్ శివాజీ కాళ్లమీద పడిపోయి ఏడ్వడం అనేది హార్ట్ టచ్చింగ్ అనిపించింది. అంతేకాదు, శివాజీ వాళ్ల అబ్బాయి రిక్కీ స్టేజ్ పైన ఏడుస్తుంటే, ఆడియన్స్ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడున్న హౌస్ మేట్స్ లో నయనీ పావనీ అయితే వెక్కి వెక్కి ఏడ్చింది. ఇది ఫినాలేలో హైలెట్ గా నిలిచింది.
9. స్టేజ్ పైన పల్లవి ప్రశాంత్ విన్నర్ అని చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతేకాదు, రెచ్చిపోయి మరీ గొడవ చేశారు. పల్లవి ప్రశాంత్ విన్నింగ్ స్పీచ్ అనేది హైలెట్ గా నిలిచింది. ఆ తర్వాత అమర్ రన్నరప్ గా మాట్లాడి అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాడు. మొత్తానికి (Bigg Boss 7 Telugu) గ్రాండ్ ఫినాలేని చాలా గ్రాండ్ గా ముగించారు.
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!