Bigg Boss 7 Telugu: ప్రియాంక జెర్నీ చూసుకుని తప్పు తెలుసుకుందా ? అసలు మేటర్ ఏంటంటే.,

బిగ్ బాస్ హౌస్ లో ఆఖరివారం హౌస్ మేట్స్ జెర్నీలు చూపించడం అనేది ఆనవాయితీ. అయితే, ఈసారి బిగ్ బాస్ ఒక రేంజ్ లో అందరికీ ఎలివేషన్ ఇస్తున్నాడు. ఫస్ట్ వీక్ నుంచీ వాళ్లు ఎలా గేమ్ మొదలు పెట్టారు. ఇక్కడి వరకూ ఎలా చేరుకున్నారు అనేది, అన్ని భావోద్వేగాలని మిక్స్ చేసి మరీ చూపిస్తున్నాడు. దీంతో హౌస్ మేట్స్ వాళ్ల జెర్నీలని పెద్ద స్క్రీన్ పైన చూస్కుని మరీ ఎమోషనల్ అయిపోతున్నారు. ఫస్ట్ డే అమర్ దీప్ ఇంకా అర్జున్ ఇద్దరికీ అయితే, తర్వాత శివాజీ ఇంకా ప్రియాంకల జెర్నీలు ఫినిష్ చేశారు.

శివాజీ జెర్నీ చూస్తుంటే అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి. ఈసారి మొత్తం జెర్నీ పాజిటివ్ గానే చూపిస్తున్నారు. ఫుల్ ఎమోషన్స్, ఎలివేషన్స్ తో ఉంది. శివాజీ జెర్నీ చూస్తుంటే ఆడియన్స్ కి చాలా బాగా అనిపించింది. ఎందుకంటే, మద్యలో షోల్డర్ ఇంజ్యూరీ అవ్వడం, వాళ్ల అబ్బాయే డాక్టర్ గా వచ్చి నాన్నా అని పిలవడం అనేది హార్ట్ టచ్చింగా ఉంది. కానీ, నయనీ పావనీ కూడా తనని డాడీ అని పిలిచి ఎలిమినేట్ అయ్యేటపుడు స్టేజ్ పైన కన్నీళ్లు పెట్టించింది. అది మాత్రం జెర్నీలో చూపించడం మిస్ అయ్యారు.

శివాజీ జెర్నీ చూస్తున్నంత సేపు బిగ్ బాస్ కి ఎలాంటి కంటెంట్ కావాలో అదంతా కూడా శివాజీ ఇచ్చాడు. ముఖ్యంగా అమర్ దీప్, తేజ, యావర్ లతో జోక్స్ వేయడం , శోభాతో ఆర్గ్యూ చేయడం, మిగతా హౌస్ మేట్స్ ని ఆటపట్టించడం, ఇలా రకరకాలుగా షేడ్స్ ని చూపించాడు శివాజీ. ప్రియాంక – అమర్ దీప్, సందీప్ లతో మాటలు విసరడం, కాఫీ కోసం బిగ్ బాస్ ని ఎదిరించడం చేశాడు. ఇలా శివాజీ జెర్నీ మిక్స్ ఎమోషన్స్ తో నడిచింది. మాయాస్త్రం కీ దాచినపుడు రాత్రిపూట హౌస్ మేట్స్ తో ఆడుకున్నది,

శుభశ్రీ చేసిన కామెంట్స్ కి శివాజీ ఫీల్ అయ్యింది ఇలా కొన్ని హైలెట్స్ జెర్నీలో మిస్ చేశారు. అయినా కూడా కామెడీ, ఎంటర్ టైన్మెంట్ అనేది బాగా పేలింది. శివాజీ జెర్నీ చూసిన తర్వాత బిగ్ బాస్ కి థ్యాంక్స్ చెప్పాడు. తన సినీ ఇండస్ట్రీ 25యేళ్ల కెరియర్ ఒక ఎత్తు అయితే, బిగ్ బాస్ కి రావడం అనేది మరో ఎత్తు అంటూ మాట్లాడాడు. అంతేకాదు, బిగ్ బాస్ వల్ల తన ఫ్యామిలీ ప్రపంచానికి పరిచయం అయ్యిందంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ప్రియాంక జెర్నీ కూడా చాలా హైలెట్ గా నిలిచింది. తను కూడా చాలా డిఫెరెంట్ గేమ్ ఆడింది.

కానీ, బిగ్ బాస్ లో చాలాసార్లు పార్షియాలిటీ చూపించింది. అలాగే, వెనుక ఎన్నో మాటలు మాట్లాడింది. కానీ, ప్రియాంక మాట్లాడినవి కాకుండా వేరేవాళ్లు ప్రియాంక గురించి మాట్లాడినవి చూపించారు. దీన్ని బట్టీ ప్రియాంకకి పిచ్చ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే., ఎక్కడ తప్పు చేశాను చెప్పండి చెప్పిండి అని పదిసార్లు శివాజీని అడిగూతూ ఉండేది. ఇప్పుడు తన జెర్నీ ప్రజలకి ఎలా పోట్రే అయ్యిందనేది అర్దమైంది. భోలే విషయంలో, అశ్విని విషయంలో రియాక్ట్ అవ్వడం అనేది తన గేమ్ ని వేరే రూట్లోకి ఎక్కించేసింది. ఇది కూడా తనకి అర్దమై ఉంటుంది.

అలాగే సీరియల్ బ్యాచ్ అంతా ఒకటే అనేది కూడా క్లారిటీ వచ్చింది. వాళ్ల ముగ్గురూ డిస్కషన్స్ పెట్టుకోవడం, ఫ్రెండ్షిప్ బాండ్ ఉండటం అనేది జెర్నీలో తెలిసింది. ఇక తను గేమ్స్ ఆడింది, కెప్టెన్ అయ్యింది. తనకోసం తన ఫియాన్సీ శివ వచ్చింది, హైయిర్ కట్ చేస్కున్నది బాగా హైలెట్ గా చూపించారు. మొత్తానికి వీరిద్దరి జెర్నీలు ఎపిసోడ్ లో హైలెట్ అయ్యాయనే చెప్పాలి. ఇక పల్లవి ప్రశాంత్ ఇంకా యవర్ జెర్నీలు ఎలా ఉంటాయనేది చూడాలి. ప్రస్తుతం శివాజీ (Bigg Boss 7 Telugu) టైటిల్ రేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. అదీ మేటర్.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus