ఈ ఇయర్ ఆ మూడే హైలెట్..!

ఈ సంవత్సరం 2020 రాంగానే ఇది అద్భుతమైన సంవత్సరం అని నెంబర్ ప్రకారం చూస్తే న్యూమరాలజీ ప్రకారం అందరికీ బాగా కలిసొస్తుందని అనుకున్నారు. కానీ, కరోనా కోరలు చాచి మరీ కాటేసింది. అన్ని పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బవేసింది ఈ సంవత్సరం. అందుకే 2020 బ్లాక్ ఇయర్ గా చరిత్రలో నిలిచిపోబోతోంది.

స్టార్టింగ్ సంక్రాంతికి కానుకగా వచ్చిన అలవైకుంఠపురములో సినిమా, అలాగే సరిలేరు నీకెవ్వరూ సినిమాలు రెండు బ్లాక్ బస్టర్స్ హిట్స్ అయ్యాయి. దీంతో ఈ సంవత్సరం మంచి బోణీ కొట్టినట్లుగా అయ్యింది. కానీ, ఈ ఆనందం కొన్నాళ్లు కూడా మిగల్లేదు.

ఆ తర్వాత జనవరి 24న వచ్చిన డిస్కోరాజా సినిమా రాజానే కాదు, రాజా ఫ్యాన్స్ ని కూడా నిరాశపరిచింది. కాన్సెప్ట్ ప్రకారం బాగానే ఉన్నా, బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత ఫలితాన్ని తీసుకుని రాలేకపోయింది.

ఫిబ్రవరి మొదటివారంలో వచ్చిన 96 రీమేక్ సినిమా జాను కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. శర్వానంద్ కి మంచి పేరు తీసుకుని వచ్చినా సమంత రేంజ్ మార్కెట్ ని కొల్లగొట్టలేకపోయింది ఈ సినిమా. ఆ తర్వాత వచ్చిన నాగశౌర్య అశ్వద్ధామ మంచి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా పెద్ద హిట్ సినిమా కాలేకపోయింది.

ఇక ఇదే ఫిబ్రవరిలో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా బాక్సాఫీస్ ముందు ఫెయిల్ అయ్యాడు. రౌడీస్టార్ కి మంచి పేరు తెచ్చినా కూడా అదే అర్జున్ రెడ్డిని మళ్లీ గుర్తుచేస్తున్నాడు అంటూ ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. శీనయ్య స్టోరీ పర్వాలేదనిపించినా, ఓవర్ ఆల్ గా సినిమా మాత్రం ఆశించినంత హిట్ కాలేకపోయింది.

ఈసారి నితిన్ మాత్రం భీష్మగా వచ్చి సాలిడ్ హిట్ ని అందుకున్నాడు. మంచి రికార్డ్ కలక్షన్స్ తో తన మార్క్ ని సెట్ చేస్కున్నాడు. దాదాపుగా 50కోట్లకి పైగానే ఈ సినిమా వసూళ్లని సాధించి మళ్లీ బాక్సాఫీస్ పుంజుకునేలా చేసింది. నితిన్ యాక్టింగ్, రష్మిక గ్లామర్, సాంగ్స్ సినిమాకి మంచి ప్లస్ అయ్యాయి.

ఆ తర్వాత నాని నిర్మించిన హిట్ సినిమా, అలాగే 1978 పలాస సినిమాలు పర్వాలేదనిపించాయి. ఈ రెండు సినిమాలు చిన్న బడ్జెట్ సినిమాలుగా వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. హిట్ సినిమాలో విశ్వక్ సేన్ కి మంచి పేరు వస్తే, పలాసలో రక్షిత్ కి మంచి ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత థియేటర్స్ మూతబడటంతో ఓటీటీలని నమ్ముకోవాల్సి వచ్చింది.

కలక్షన్స్ పరంగా ఓటీటీల్లో కూడా చిన్న సినిమాలు దుమ్మురేపాయనే చెప్పాలి. నిశ్శబ్దం, వి సినిమాలు ఓటీటీల్లో డైరెక్ట్ గా రిలాజై పెద్ద ప్రభావాన్ని చూపించలేకపోయాయి. మంచి థ్రిల్లర్ సిినిమాలుగా అవుతాయని ఆశించిన ప్రేక్షకులకి నిరాశ కలిగింది.

ఆ తర్వాత చిన్న సినిమాలు ఓటీటీలో సక్సెస్ అయ్యాయి. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, అలాగే కలర్ ఫోటో సినిమాలకి మంచి పేరు వచ్చింది. ఇక డబ్బింగ్ సినిమాలు, మల్టీ లాంగ్వేజ్ సినిమాలు కూడా ఓటీటీల్లో బాగా సక్సెస్ అయ్యాయి. పెంగ్విన్, మిస్ ఇండియా, 47డేస్, అమ్మోరుతల్లి , మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలు పర్వాలేదనిపించాయి.

హీరో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమా ఓటీటీలో మంచి సక్సెస్ ని అందుకుని పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓవర్ ఆల్ గా చూస్తే ఈ సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి చాలా బ్యాడ్ అనే చెప్పాలి. కేవలం మూడే మూడు సినిమాలు మంచి హిట్స్ ని అందుకున్నాయి.అలవైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్లని సాధించాయి. ఇక ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి , బాక్సాఫీస్ ని షేక్ చేసే సినిమాలు వస్తాయా రావా అనేది చూడాలి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus