దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) వరుస సక్సెస్..లతో దూసుపోతున్నాడు. అతను వరుసగా 8 హిట్లు ఇచ్చి స్టార్ అయిపోయాడు. మరో హిట్టు కొడితే అతను మూడు హ్యాట్రిక్..లు కొట్టినట్టే. ఇదిలా ఉండగా.. దర్శకుడు అనిల్ రావిపూడి ప్రయాణం ‘పటాస్’ తో (Pataas) మొదలైంది అనే సంగతి అందరికీ తెలిసిందే. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమాలో శృతి సోది (Shruti Sodhi) హీరోయిన్ గా నటించింది. స్వయంగా కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషంగా చెప్పుకోవాలి.
2015 జనవరి 23న పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. అయినప్పటికీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అంటే అనిల్ రావిపూడి దర్శకుడిగా మారి 10 ఏళ్ళు పూర్తికావస్తోందన్న మాట. ఈ క్రమంలో ‘పటాస్’ (Pataas) క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 4.80 cr |
సీడెడ్ | 2.90 cr |
ఉత్తరాంధ్ర | 1.80 cr |
ఈస్ట్ | 1.70 cr |
వెస్ట్ | 0.90 cr |
కృష్ణా | 0.92 cr |
గుంటూరు | 1.70 cr |
నెల్లూరు | 0.55 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 15.27 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.20 cr |
ఓవర్సీస్ | 0.65 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 17.12 cr (షేర్) |
‘పటాస్’ సినిమా రూ.9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.17.12 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా రూ.8.12 కోట్ల లాభాలను బయ్యర్స్ కి అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.