పురందేశ్వరీ పాత్ర పోషించనున్న నృత్య కారిణి

  • September 22, 2018 / 12:50 PM IST

తెలుగు వారి కీర్తిని పెంచిన మహానుభావుడు ఎన్టీఆర్ జీవితంపై తీస్తున్న బయోపిక్ మూవీ తారలతో నిండిపోతోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ భార్య బసవతారకమ్మ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ నటిస్తోంది. ఏఎన్నార్ గా సుమంత్, కృష్ణ గా సుధీర్ బాబు, చంద్రబాబు నాయుడిగా రానా నటించనున్న ఈ చిత్రంలో నరేష్ నిర్మాత బొగట వెంకట సుబ్బారావు పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి పాత్ర కోసం నృత్యకారిణి హిమన్సీని తీసుకున్నట్టు తెలిసింది.

విజయవాడకు చెందిన ఆమె సినిమా షూటింగ్‌లో జాయిన్ అయినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అంతేకాదు పురందేశ్వరి గెటప్‌లో హిమన్సీ ఉన్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో పురందేశ్వరి ఆమె పక్కన నిల్చుని నవ్వుతూ కనిపించారు. హిమన్సీ ఈ పాత్రకు చక్కగా సరిపోయారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె లుక్ ని అధికారికంగా రిలీజ్ చేసే వరకు పూర్తిగా నమ్మలేము. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి బాలయ్య నిర్మిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎం ఎం కీరవాణి సంగీతమందిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus