Pushpaka Vimanam: ‘పుష్పక విమానం’ ఇంకా ఎగరేయాలని చూస్తున్నారా!

సినిమా ప్రచారాలు చాలా రకములు. అందులో ఒకటి మన సినిమాకు పక్క ఇండస్ట్రీలో అద్భుతమైన రెస్పాన్స్‌ ఉందని చెప్పడం. అంటే తెలుగులో విడుదలైన సినిమా హక్కుల కోసం బాలీవుడ్‌లో మంచి రెస్పాన్స్‌ వస్తోందని చెప్పడం. గతంలో కొన్ని సినిమాలు ఇలా చేయడం చూశాం. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ కూడా ఇలాంటి పనే చేస్తున్నాడా? ఏమో ‘పుష్పక విమానం’ సినిమా టీమ్‌ ప్రచారం శైలి చూస్తుంటే అంతే అనిపిస్తోంది. తాజాగా దేవరకొండ టీమ్‌ రిలీజ్‌ చేసిన ప్రెస్‌ నోట్‌ అలానే ఉంది.

మా ‘పుష్పక విమానం’ సినిమాకు ఇక్కడ మంచి ఆదరణ దక్కుతోంది అంటూ రాస్తూనే… సినిమా బాలీవుడ్‌ జనాలను కూడా ఆకర్షిస్తోందని అందుకే అక్కడి నుండి మూడు నిర్మాణ సంస్థలు ముందుకొచ్చాయని చెబుతున్నారు. కొత్త తరం కామెడీ, మిస్టరీ కథతో వచ్చిన ఈ సినిమాను బాలీవుడ్‌ నుంచి ప్రముఖ నిర్మాణ సంస్థలు రీమేక్‌ చేస్తామని అడుగుతున్నాయట. అయితే ఎవరికి ఇవ్వాలో ఇంకా చిత్రబృందం నిర్ణయం తీసుకోలేదట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువరిస్తాం అని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ చెప్పారు.

బాలీవుడ్ రీమేక్ గురించి సంప్రదింపులు జరుపుతున్న ఆ మూడు సంస్థల వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తా అని కూడా చెబుతున్నారు. ఈ మాటతోనే సినిమాకు బాలీవుడ్‌ పిలుపు అనే విషయం డౌట్‌గా మారింది. ఈ సినిమాను బాలీవుడ్‌ జనాలు చూసి, రీమేక్‌ హక్కులు అడిగేతంత పెద్ద విజయం సినిమాకు దక్కిందా అంటూ టాలీవుడ్‌ జనాలు థియేటర్లకు వస్తారనేది దేవరకొండ టీమ్‌ ప్లాన్‌ ఏమో. పోనీలెండి ఒకవేళ అలానే హిందీకెళ్తే మనకే మంచిది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus