తమిళ క్రేజీ హీరో విజయ్ సేతుపతి ఇప్పుడు వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగా గడుపుతుంటాడు. అభిమానులు ముద్దుగా మక్కల్ సెల్వన్ అంటూ పిలుచుకునే ఈ నటుడు… తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇతను నటించిన తమిళ సినిమాలు తెలుగు ప్రేక్షకులు కూడా చూస్తూ ఉంటారు. ‘విక్రమ్ వేదా’ ’96’ వంటి చిత్రాలు తెలుగులో డబ్ కాకపోయినా … మన తెలుగు ప్రేక్షకులు చాలా మంది ఆ చిత్రాలను చూసారు. అప్పటి నుండీ ఆయన సినిమాలు అంటే ఇక్కడ కూడా క్రేజ్ ఏర్పడింది.
‘పేట’ ‘సైరా నరసింహా రెడ్డి’ వంటి చిత్రాలతో మరింతగా ఇక్కడ పాపులర్ అయ్యాడు.ఇదిలా ఉంటే.. తాజాగా ఇతని పై హిందూ సంఘాలు మండి పడుతుండడం పెద్ద చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న విజయ్ సేతుపతి…హిందూ దేవుళ్లకు జరిగే అభిషేకం, అలంకరణ, కైంకర్యాలను తప్పుపడుతూ కొన్ని కామెంట్స్ చేసాడు.ఈ వ్యాఖ్యల పై అఖిల భారత హిందూ మహాసభ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు లేఖ రాసింది.
విజయ్ సేతుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. హిందూ దేవుళ్ళ పై ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తే ఊరుకోము. పబ్లిసిటీ కోసం హిందూ దేవుళ్ళే దొరికారా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం పై విజయ్ సేతుపతి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఇక తెలుగులో ‘ఉప్పెన’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు విజయ్ సేతుపతి.
Most Recommended Video
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు
అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు సినిమాలు…!
‘మహానటి’ లోని మనం చూడని సావిత్రి, కీర్తి సురేష్ ల ఫోటోలు…!