Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 2’. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది.

Hit 2 Collections

విశ్వక్ సేన్ తో చేసిన ‘హిట్’ సూపర్ హిట్ అవ్వడంతో.. దాన్ని యూనివర్స్ గా క్రియేట్ చేసి 7 సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా ‘హిట్ 2’ ‘హిట్ 3’ వచ్చాయి. అన్నీ సూపర్ హిట్లు అయ్యాయి. 2022 డిసెంబర్ 2న ‘హిట్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

ఈ సందర్భంగా ‘హిట్ 2’ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 7.51 cr
సీడెడ్ 1.64 cr
ఉత్తరాంధ్ర 2.01 cr
ఈస్ట్ 1.01 cr
వెస్ట్ 0.67 cr
గుంటూరు 0.95 cr
కృష్ణా 1.03 cr
నెల్లూరు 0.55 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 15.37 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  2.58 cr
ఓవర్సీస్ 4.55cr
టోటల్ వరల్డ్ వైడ్ 22.5 కోట్లు(షేర్)

 

‘హిట్ 2′(Hit 2) చిత్రం రూ.13.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.22.5 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.9.25 కోట్ల లాభాలు అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత శేష్ ఫుల్ లెంగ్త్ హీరోగా మరో సినిమా రాలేదు అనే చెప్పాలి.

‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus