Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను… లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అలాంటి వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా వచ్చింది `అఖండ`. 2021 డిసెంబర్ 2న ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Akhanda Collections

తర్వాత అల్లు అర్జున్ ‘పుష్ప'(పుష్ప ది రైజ్), నాని ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి సూపర్ హిట్ సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ ‘అఖండ’ నిలకడగా రన్ ను కొనసాగించి బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సాధించింది.ఇప్పుడు ‘అఖండ 2’ కూడా రూపొందింది. మరో 3 రోజుల్లో ఆ సినిమా కూడా రిలీజ్ కానుంది. నేటితో ‘అఖండ’ రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

ఈ సందర్భంగా ‘అఖండ’ క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 20.84 cr
సీడెడ్ 15.91 cr
ఉత్తరాంధ్ర 6.34 cr
ఈస్ట్ 4.29 cr
వెస్ట్ 4.03 cr
గుంటూరు 4.89 cr
కృష్ణా 3.67 cr
నెల్లూరు 2.67 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 62.64 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 10.65cr
టోటల్ వరల్డ్ వైడ్ 73.29 కోట్లు(షేర్)

 

‘అఖండ'(Akhanda) చిత్రం రూ.54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.73.29 కోట్ల షేర్ ను రాబట్టి… రూ.19.29 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ టైంకి బాలకృష్ణ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ‘అఖండ’.

మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus