HIT2 Collections: ‘హిట్ 2’ .. ఈ వీకెండ్ కూడా కుమ్మేలా ఉందిగా..!

‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్ 2′( హిట్ : సెకండ్ కేస్). అడివి శేష్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది.డిసెంబర్ 2న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అడివి శేష్ గత చిత్రాలు అన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి.

‘మేజర్’ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించింది. కాబట్టి.. ‘హిట్2’ పై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి అని చెప్పాలి. అందుకు తగ్గట్టే ఫస్ట్ డే హిట్ టాక్ ను రాబట్టుకోవడంతో మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. మొదటి వీకెండ్ కే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించింది.వీక్ డేస్ లో కొంత డౌన్ అయినా స్టడీగానే కలెక్ట్ చేస్తుంది. ఒకసారి ‘హిట్ 2’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 6.31 cr
సీడెడ్ 1.36 cr
ఉత్తరాంధ్ర 1.69 cr
ఈస్ట్ 0.84 cr
వెస్ట్ 0.56 cr
గుంటూరు 0.81 cr
కృష్ణా 0.79 cr
నెల్లూరు 0.48 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 12.84 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.97 cr
ఓవర్సీస్ 3.95 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 18.76 cr (షేర్)

‘హిట్ 2’ చిత్రానికి రూ.12.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.13.25 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ చిత్రం..మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.18.76 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కు ఆల్రెడీ రూ.5.51 కోట్ల లాభాలను అందించింది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus