తెలుగు సినిమా నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , తన అభినయం, యాక్షన్ స్కిల్స్‌తో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ న్యూ లెవల్‌కి వెళ్లింది. ఈ సినిమాలో అతని యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఎన్టీఆర్ నటనపై ప్రశంసల జల్లు కురిపించడం విశేషం. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ ఆడియెన్స్ చూసి ఎన్టీఆర్ ప్రతిభపై ముగ్ధులయ్యారు.
ముఖ్యంగా టైగర్ తో ఇంట్రో సన్నివేశాలు, జంతువులతో చేసిన యాక్షన్ సీన్స్ అన్నీ తారక్ ను హాలీవుడ్ దిశగా తీసుకెళ్లాయి. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ గన్ ఏకంగా ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ఉందని తన కోరికను చెప్పడం తెలుగు ప్రేక్షకులకు గర్వకారణం. ఆయన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. జేమ్స్ గన్, ‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ,’ ‘ది స్యూసైడ్ స్క్వాడ్’ వంటి హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు.
“ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ నటన నాకు గొప్ప స్ఫూర్తిగా నిలిచింది. ముఖ్యంగా వైల్డ్ యానిమల్స్ తో చేసిన సీన్ నాకు ప్రత్యేకంగా నచ్చింది. ఆయనతో పని చేయాలని కోరుకుంటున్నాను,” అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఎన్టీఆర్ స్థాయిని హాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చింది. రాజమౌళి సినిమా తర్వాత, ఎన్టీఆర్‌కి పాన్ వరల్డ్ మార్కెట్ ఓపెన్ అయ్యింది. ఇక టాలీవుడ్ నటులు ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్‌ను దాటించి పాన్ వరల్డ్ దిశగా వెళ్తున్నారు.
భవిష్యత్తులో తప్పకుండా ఎన్టీఆర్ వంటి నటులు గ్లోబల్ ప్రాజెక్టుల్లో నటిస్తారని ఇలాంటి దర్శకుల కామెంట్స్ ద్వారా అర్ధమవుతుంది. ఫైనల్ గా తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. హాలీవుడ్ దర్శకులు కూడా తెలుగులో ఉన్న ప్రతిభను గుర్తించడం గర్వకారణమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
“The Main Guy of RRR, I want to work with #JrNTR in Future “
~ #JamesGunn :-One of the World’s Biggest Directors about #JrNTR pic.twitter.com/T24NLfg8Mp
— CineHub (@Its_CineHub) January 18, 2025