ఆర్‌ఆర్‌ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ దుబాయ్‌లో గ్రాండ్‌గా జరగనున్న సంగతి తెలిసిందే. నిర్మాత డివివి దానయ్యతో పాటు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ వేదికను ఖరారు చేయడానికి, అవసరమైన అనుమతులు పొందడానికి దుబాయ్‌కి వెళ్లారు. ఈ ఈవెంట్‌ని అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేశారనీ, పలువురు అంతర్జాతీయ ప్రముఖులు ఈ ఈవెంట్‌కి హాజరవుతారని తెలుస్తోంది. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం అనేక హాలీవుడ్ స్టూడియోలు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను ఇంగ్లీష్ వెర్షన్‌ను విడుదల చేయడానికి ఆసక్తిగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ హాలీవుడ్ స్టూడియో వార్నర్ బ్రదర్స్ ఆర్‌ఆర్‌ఆర్ యొక్క ఇంగ్లీష్ వెర్షన్‌ను విడుదల చేయడానికి రాజమౌళితో చర్చలు కూడా జరిపినట్లు టాక్ వస్తోంది. డబ్బింగ్ లాంఛనాలు మరియు ప్రమోషన్‌లకు తగినంత సమయం పడుతుందట.ఈ విషయంలో ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి రాజమౌళి టీమ్ భారతీయ భాషలలో విడుదలపై ఫోకస్ పెట్టారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫ్రీడమ్ ఫైటర్స్ గా నటించిన విషయం తెలిసిందే.
ఇక వారికి జోడిగా అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, అజయ్ దేవగన్, శ్రియ శరణ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ వచ్చే ఏడాది జనవరి 7న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ ను త్వరలోనే విడుదల చేయజున్నట్లు సమాచారం.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?