మనం చూసే సంఘటనలు, దృశ్యాలు మనపై ఎంతోకొంత ప్రభావితం చేస్తాయి. మంచి సినిమా, సన్నివేశం చూపినప్పుడూ అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఎంతలా అంటే వాటిని మనం అనుసరించే అంత. గొప్ప క్రియేటర్లుగా పేరు తెచ్చుకున్న వారు కూడా ఆ సన్నివేశం ఇచ్చిన స్పూర్తితో అదే సీన్ తెరకెక్కిస్తుంటారు. అలా మన దర్శకులకు స్ఫూర్తినిచ్చిన హాలీవుడ్ సన్నివేశాలు, కథల పై ఫోకస్…
“సై” క్లైమాక్స్
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో “సై” ఒకటి. ఇందులో క్లైమాక్స్ లో హీరో బృందం ఓడిపోయే దశలో ఉంటే రాజీవ్ కనకాల వారిని మోటివేట్ చేసే సన్నివేశం “Any Given Sunday” అనే చిత్రం నుంచి తీసుకున్నారు.
“ఇద్దరమ్మాయిలతో” ఇంట్రెవెల్ ఫైట్
డేరింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ టేకింగ్ సూపర్ గా ఉంటుంది. అయన దర్శకత్వంలో వచ్చిన “ఇద్దరమ్మాయిలతో” సినిమాలో విశ్రాంతికి ముందు వచ్చే ఫైట్ కొత్తగా ఉంటుంది. దీనికి స్ఫూర్తి కొరియన్ ‘The man from now here ” సినిమాలోని ఫైట్.
అరుంధతి డ్రమ్ ఫైట్
అనుష్క కెరీర్ ని మలుపు తిప్పిన మూవీలో డ్రమ్ ఫైట్. ఈ ఫైట్ సెక్వెన్స్ ని దర్శకుడు కోడి రామ కృష్ణ చైనీస్ సినిమా “House of flying daggers ” నుంచి తీసుకున్నారు.
అతడు లో జంప్ సీన్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఇంగ్లిష్ సినిమాల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అతడు చిత్రంలో మహేష్ బాబు బిల్డింగ్ నుంచి రైలు పై దూసే సీన్ ని “U.S. Marshals ” లోని సన్నివేశాన్ని ఇన్ స్పైర్ అయ్యి చేశారు.
https://youtu.be/EP_wJ1NG7t0?t=28m34s
ఊసరవెల్లి కీలక సీన్
ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా కుటుంబ సభ్యులను విలన్లు చంపే సీన్ ని డైరక్టర్ సురేందర్ రెడ్డి హాంగ్ కాంగ్ థ్రిల్లర్ మూవీ “Vengeance ” లోని సీన్ ని చూసి, అదేవిధంగా తెరకెక్కించారు.
https://youtu.be/lcCCRGYrh0c?t=1h54m4s
రచ్చ ఫైట్
రచ్చమూవీలో రామ్ చరణ్ వెదురు చెట్లపై చేసే ఫైట్ తెలుగు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఫైట్ ని “The last vampire.” అనే చైనీస్ మూవీ నుంచి ఉన్నదీ ఉన్నట్లుగా డైరక్టర్ సంపత్ నంది దింపేశారు.
ఢమరుఖం క్లైమాక్స్ ఫైట్
అక్కినేని నాగార్జున చేసిన సోషియో ఫాంటసీ చిత్రం ఢమరుఖం. శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో చివరి ఫైట్ హాంగ్ కాంగ్ యాక్షన్ సినిమా ” Kung Fu Hustle.” చూసి స్ఫూర్తి పొందారు.
ఎందుకంటే ప్రేమంట
రామ్, తమన్నా జంటగా నటించిన “ఎందుకంటే ప్రేమంట” మూవీలో కొన్ని సీన్లు మాత్రమే.. కథ మొత్తం అమెరికన్ మూవీ ” Just Like Heaven.” చూసి రాసుకున్నదే.
ఆటోనగర్ సూర్యలో సాంగ్
నాగచైతన్య, సమంత కలిసి నటించిన రెండో సినిమా ఆటోనగర్ సూర్య. దేవా కట్ట తెరకెక్కించిన సినిమాలో సీన్లు ఏవి కాపీ కానప్పటికీ “నిన్నే చూసానా? అనే పాట ప్రేరణ మాత్రం ఇంగ్లీష్ పాప్ సింగర్ కన్యే వెస్ట్ విడుదల చేసిన ఆల్బమ్ “Love Lockdown” అని ఎవరిని అడిగినా చెబుతారు.