Love Mouli: బోల్డ్ సీన్స్ వల్లే.. నవదీప్ సినిమాకి కలిసొచ్చిందా..!

కొంత గ్యాప్ తర్వాత నవదీప్ సోలో హీరోగా ‘లవ్ మౌళి’ (Love Mouli) అనే సినిమా తెరకెక్కింది. అవ‌నీంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘నైరా క్రియేషన్స్’ మరియు ‘శ్రీకర స్టూడియోస్’ బ్యానర్లపై సి స్పేస్ వారు నిర్మించారు. పంఖురి గిద్వానీ (Pankhuri Gidwani), భావన సాగి  హీరోయిన్లు. ‘లవ్ మౌళి’ టీజర్, ట్రైలర్స్ ఈ మధ్య ఎక్కువగా చర్చనీయాంశం అయ్యాయి. నవదీప్ (Navdeep Pallapolu) లుక్ చిత్ర విచిత్రంగా ఉండటం, లేడీస్ ఇన్నర్స్ నోటి దగ్గర పెట్టుకుని అతను మందు తాగడం, హీరోయిన్స్ ని నేరుగా హీరో బట్టలు విప్పేయమనడం, బెడ్ రూమ్ సీన్స్ తో ప్రోమోస్..

ఇలా అన్ని రకాలుగా ‘లవ్ మౌళి’ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఈ సినిమాలో ఏకంగా 42 లిప్ లాక్ సీన్స్ ఉంటాయట. వీటన్నిటినీ బట్టి మేకర్స్ ‘లవ్ మౌళి’ ని కేవలం యూత్ ని టార్గెట్ చేసే తీశారు అని స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా.. సోలో హీరోగా నవదీప్ ఓ సినిమా చేసి చాలా కాలమే అయ్యింది. ఇక ‘లవ్ మౌళి’ చిత్రం ప్రీమియర్స్ ఈరోజు వైజాగ్ లో ఏర్పాటు చేశారు మేకర్స్.

ఆన్లైన్ లో టికెట్స్ ఇలా పెట్టగానే అలా హాట్ కేకుల్లా సేల్ అయిపోయాయి. 2007 లో వచ్చిన ‘చందమామ’ (Chandamama) తర్వాత నవదీప్ హీరోగా పలు సినిమాల్లో నటించాడు. కానీ ఆ సినిమాలా…తర్వాత వచ్చిన సినిమాలు.. ఎక్కడా కూడా హౌస్ ఫుల్ బోర్డులు పెట్టలేదు. మళ్ళీ ‘లవ్ మౌళి’ సినిమాకే ఆ అద్భుతం జరిగింది. అంటే 17 ఏళ్ల తర్వాత నవదీప్ హీరోగా చేసిన సినిమాకి హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయన్న మాట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus