సంక్రాంతి కానుకగా విడుదలైన ఏకైక పెద్ద సినిమా ‘బంగార్రాజు’. పక్కన రిలీజైన ‘రౌడీ బాయ్స్’ ‘హీరో’ ‘సూపర్ మచ్చి’ అన్నీ చిన్న సినిమాలే. ‘హీరో’ ‘రౌడీ బాయ్స్’ కి పెద్ద ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. కానీ అందరి చూపు ‘బంగార్రాజు’ పైనే ఉంది కాబట్టి… దానికే జనాలు ఓటేశారు. నిజానికి ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ అయితే రాలేదు. యావరేజ్ టు అబౌవ్ యావరేజ్ అనే టాకే వచ్చింది. అయినా ఈ మూవీ తప్ప జనాలకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి.. దీనికే క్యూలు కట్టారు.
మొదటి వారం గడిచింది వసూళ్ళు భారీగా ఎక్స్పెక్ట్ చేస్తే బాగా వచ్చాయి అని చెప్పుకునేలా వచ్చాయి. మొదటి వారం ఈ చిత్రం 80 శాతం పైగా రికవరీని సాధించింది.ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలు ఏవి కూడా ఏపీలో మంచి వసూళ్ళని రాబట్టలేకపోయాయి. కానీ ‘బంగార్రాజు’ మాత్రం ఆ ఒక్క చోటనే భారీగా రాబడుతుంది. ఏపి ప్రభుత్వం అక్కడ టికెట్ రేట్లు ఎక్కువ అమ్మకూడదనే నిబంధన పెట్టింది. రూ.100 కి మించి టికెట్ రేట్ ఉండకూడదని.. అమ్మిన థియేటర్లని సీజ్ చేస్తామని కూడా హెచ్చరించింది.
అయితే ‘బంగార్రాజు’ ప్రదర్శింప పడుతున్న థియేటర్లలో రూ.150 నుండీ రూ.200, రూ.250 వరకు టికెట్ రేట్లు అమ్ముతున్నారు. ‘ఇదేమని థియేటర్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. ఈ సినిమాకి మాకు పర్మిషన్ ఉంది’ అంటూ సమాధానం ఇచ్చారు. మొదటి నుండీ ‘బంగార్రాజు’ సినిమా విషయంలో ఏపి ప్రభుత్వం పక్షపాతం చూపిస్తూనే ఉంది. పేదవాడి కోసం వినోదాన్ని తక్కువ రేట్లకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. మరి ‘బంగార్రాజు’ విషయంలో ఏపి ప్రభుత్వం పేదవాడి గురించి ఆలోచించలేదా?