‘భోళా శంకర్’ సినిమాలో చిరంజీవి పాత్రతోపాటు సమానంగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర కీర్తి సురేశ్‌ది. శంకర్ సోదరిగా ఈ సినిమాలో కీర్తి సురేశ్ నటించింది. తమిళంలో ఆ పాత్ర పోషించిన లక్ష్మీ మేనన్‌కు మంచి పేరు వచ్చింది. అయితే తెలుగులో ఈ పాత్రలో కనిపించాల్సిన నటి సాయిపల్లవి. ఈ మేరకు చిరంజీవి ఏకంగా ఓ కార్యక్రమంలో ఆమెను అడిగేశారు కూడా. ‘మా సినిమాలో నటించమంటే నో ఎందుకు చెప్పావు’ అని. అయితే ఆ తర్వాత ఈ సినిమాలో చెల్లిగా కీర్తి సురేశ్‌ను తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
అయితే.. అసలు ‘భోళా శంకర్’ సినిమాలో కీర్తి సురేశ్ ఎలా వచ్చింది అనే విషయంలో క్లారిటీ వచ్చింది. ఇప్పటికే చిరంజీవి ఓ కార్యక్రమంలో చెప్పగా… సినిమా ప్రచారంలో భాగంగా దర్శకుడు మెహర్ రమేశ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకాస్త క్లారిటీ వచ్చింది అని చెప్పాలి. ‘కంత్రి’, ‘బిల్లా’ సినిమాలతో మెప్పించిన మెహర్ రమేశ్ ‘శక్తి’, ‘షాడో’ సినిమాలతో ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత ‘భోళాశంకర్’ చేశారు.
సినిమాలో సోదరభావం నచ్చడంతో ఈ కథ ఎంచుకున్నాం అని మెహర్ చెప్పారు. సినిమాలో ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి అని కూడా చెప్పారు. సినిమాలో యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు అన్నాచెల్లెలి ఎమోషన్ దండిగా ఉంటుంది. అలాంటి ఈ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్ర పోషించాలంటే అగ్ర నటి కావాలనిపించింది. నిర్మాత స్వప్న దత్ ద్వారా కీర్తి సురేశ్‌ని (Keerthy Suresh) సంప్రదించి కథ గురించి చెప్పారట మెహర్ రమేశ్.
ఆమె బాగా కనెక్ట్ అయ్యి… నటించేందుకు వెంటనే అంగీకరించిందట. చిరంజీవి అన్నయ్యను డైరెక్ట్ చేయడం తన డ్రీమ్ అని చెప్పిన మెహర్ రమేశ్… ఆయన్ను బాగా చూపించాలనుకుంటూ ఈ సినిమా తీశానని చెప్పారు. ఆయన్ను డైరెక్ట్ చేసి, సినిమా ‘బాగుందిరా’ అనిపించుకోవడం సంతోషంగా ఉంది. 120 రోజుల్లో షూటింగ్ పూర్తయ్యాక ‘చాలా వేగంగా పూర్తి చేశావ్’ అని చిరంజీవి అన్నారని మెహర్ రమేశ్ చెప్పారు.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!