Pushpa2 The Rule: పుష్ప 2: అసలు నార్త్ రివ్యూలు ఎలా ఉన్నాయి?

ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న పుష్ప 2: ది రూల్ (Pushpa2 The Rule)  ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్‌తో విడుదలైంది. అల్లు అర్జున్  (Allu Arjun)  పుష్పరాజ్ పాత్రలో మరోసారి దుమ్ము రేపగా, సుకుమార్ (Sukumar) కథనానికి ప్రతి కోణంలో ప్రశంసలు అందుతున్నాయి. సౌత్‌లో ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుండగా, నార్త్ ఇండియాలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటోంది. నార్త్ ఇండియన్ మార్కెట్‌పై ముందే భారీ అంచనాలు ఉండగా, విడుదలైన తర్వాత అన్ని రకాల సమీక్షలు సినిమాను పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి.

Pushpa2 The Rule

ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమ పుష్ప 2ని ఒక మాస్ ఎంటర్టైనర్‌గా అభివర్ణిస్తోంది. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్‌కు అక్కడి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మల్టీషేడ్ క్యారెక్టర్‌ను అతను పోషించిన విధానం పై ఫిల్మ్ ఫేర్ 4 స్టార్ రేటింగ్ ఇవ్వడమే కాకుండా, “ఇది ఆయన కెరీర్‌లోని బెస్ట్ పెర్ఫార్మెన్స్” అని అభిప్రాయపడింది. టైమ్స్ ఆఫ్ ఇండియా 3.5 స్టార్ రేటింగ్ ఇచ్చి, “ఈ సీక్వెల్ ఎమోషన్లలో ఫస్ట్ పార్ట్‌కు మించి ఉంది” అని పేర్కొంది.

క్రిటిక్ తరణ్ ఆదర్శ్ 4.5 రేటింగ్ ఇచ్చి, పుష్ప 2ని “వైల్డ్ మాస్ ఎంటర్టైనర్”గా అభివర్ణించారు. నార్త్ వెబ్‌ సైట్లు పింక్ విల్లా, ఫస్ట్‌ పోస్ట్‌ లాంటి ప్రముఖ మీడియా పోర్టల్స్ కూడా సినిమాకు 4 స్టార్ రేటింగ్ ఇస్తూ, స్టోరీ టెల్లింగ్, విజువల్స్‌ను ప్రశంసించాయి. అలాగే బోనాఫైడ్ మాస్ ఎంటర్టైనర్‌గా బాలీవుడ్ హంగామా పుష్ప 2కి 4.5 స్టార్ రేటింగ్ ఇచ్చి, “ఇది నార్త్ ఆడియన్స్‌కు మరిచిపోలేని అనుభవం” అని అభివర్ణించింది.

సినిమా టెక్నికల్ అంశాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, అల్లు అర్జున్ కెమిస్ట్రీపై నార్త్ క్రిటిక్స్ స్పష్టమైన ప్రశంసలు కురిపించారు. మొత్తానికి, పుష్ప 2 నార్త్ మార్కెట్‌లో పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించబోతోందని స్పష్టమవుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉండగా, మాస్ ఎలిమెంట్స్ పుష్ప 2ని నార్త్ ఆడియన్స్ హృదయాలకు చేరుస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు చూస్తే, ఈ సీక్వెల్ బాలీవుడ్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఆ నిర్మాత ఏమన్నారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus