Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట
- August 4, 2026 / 02:22 PM ISTByPhani Kumar
గోపిచంద్(Gopichand) కెరీర్లో ‘యజ్ఞం’ సినిమాకి స్పెషల్ ప్లేస్ ఉంటుంది. విలన్ గా చేస్తున్న అతన్ని తిరిగి హీరోగా చేసింది ఈ సినిమానే. అయితే ఈ సినిమాకి అతను ఫస్ట్ ఆప్షన్ కాదు అనే విషయం చాలా మందికి తెలిసుండకపోవచ్చు. వాస్తవానికి ‘యజ్ఞం’ సినిమా కథని మొదట ప్రభాస్ అండ్ ఫ్యామిలీకి నెరేషన్ ఇప్పించారట నిర్మాత పోకూరి బాబూరావు. నెరేషన్ అనంతరం ‘కథ బాగుంది.. కానీ వేరే దర్శకుడు అయితే చేద్దాం’ అంటూ వాళ్ళు సమాధానం ఇచ్చారట.
Gopichand

తర్వాత కళ్యాణ్ రామ్ కి వినిపించగా.. అక్కడి నుండి కూడా సేమ్ రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఆ టైంలో దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి తీసిన ‘మనసుతో’ ప్లాప్ అవ్వడం. అలాగే ‘యజ్ఞం’ పక్కా మాస్ కథ కావడంతో.. అతను హ్యాండిల్ చేయగలడా లేదా అనే అనుమానాలు ఉండటంతో వారు వద్దన్నట్టు తెలుస్తోంది. దీంతో ఫైనల్ గా ‘యజ్ఞం’ కథని గోపీచంద్ వద్దకి తీసుకొచ్చారు బాబూరావు. కానీ ఆ టైమ్లో ‘నిజం’ సినిమా కోసం గుండు చేయించుకున్నాడు గోపీచంద్.
అలాగే ‘వర్షం’ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు.. అందువల్ల ‘కొన్నాళ్ళు ఆగి చేద్దాం’ అని బాబూరావ్ కి చెప్పాడట గోపీచంద్. అలా ‘యజ్ఞం’ కంప్లీట్ అయ్యింది.అది మంచి కమర్షియల్ హిట్ అయ్యింది. 2004 లో విడుదలైన ‘యజ్ఞం’ సినిమా గోపీచంద్ ను హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత అతను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.ఈ విధంగా గోపిచంద్ హీరోగా నిలబడటం వెనుక ప్రభాస్, కళ్యాణ్ రామ్ ఉన్నారని చెప్పొచ్చు.
ఒకవేళ ఆ సినిమాని పైన చెప్పుకున్న హీరోలు చేసినా బాగానే ఉండేదేమో. పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరోలు కాబట్టి.. ఆ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యి ఉండేది. కానీ గోపిచంద్ చేయడం వలన.. అతనికి హీరోగా మంచి లైఫ్ దొరికినట్టు అయ్యింది. దర్శకుడికి కూడా బిగ్ బ్రేక్ లభించినట్టు అయ్యింది.. అది మేటర్..!














