Hrithik Roshan: బాలీవుడ్‌ స్టైల్‌ కామెంట్లు చేసిన హృతిక్‌.. ఆ హీరోను పొగిడేస్తూ భారీ డైలాగ్‌లు!

బాలీవుడ్‌లో కొన్ని రకాల రిలేషన్స్‌ ఉంటాయి. అవి చాలా డేంజర్ అని ముంబయి వర్గాల టాక్‌. అంటే సినిమా ఉంటే ఒకలా, సినిమా లేకపోతే ఒకలా మాట్లాడతారు అక్కడి జనాలు అని అంటుంటారు. అంటే సినిమా షూటింగ్‌ దశలో ఉండగా.. ఏదో రిలేషన్‌ ఉన్నట్లు, రిలేషన్‌షిప్స్‌లో ఉన్నట్లు తెగ మాట్లాడేస్తారు. ఆ తర్వాత ఎవరిని ఎవరూ పట్టించుకోరు అని చెబుతుంటారు. ఇప్పుడు దీని గురించి చర్చ ఎందుకు అంటే ఓ బాలీవుడ్‌ స్టార్ హీరో మన స్టార్‌ హీరో గురించి అలా మాట్లాడాడు కాబట్టి.

Hrithik Roshan

ప్రముఖ టాలీవుడ్‌ హీరో ఎన్టీఆర్‌పై బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు హృతిక్‌ రోషన్ (Hrithik Roshan) కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న హృతిక్‌ దగ్గర అభిమాన నటుల ప్రస్తావ వచ్చింది. దానికి బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ (Jr NTR) పేరు చెప్పుకొచ్చాడు. అంతేనా కాస్త పొగిడేశాడు కూడా. ఈ సమయంలో వీరిద్దరూ కలసి ‘వార్‌ 2’ (War 2) అనే సినిమాలో నటిస్తున్న విషయం గుర్తు చేయాలి. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల అవుతోంది. తారక్‌ గురించి చెప్పడంతోపాటు ‘వార్‌ 2’ గురించి కూడా మాట్లాడాడు.

పాట మినహా ‘వార్ 2’ సినిమా షూటింగ్‌ పూర్తయ్యిందని సినిమా అప్‌డేట్‌ ఇచ్చిన హృతిక్‌.. ఆగస్టు 14న థియేటర్లు కేరింతలతో మారుమోగిపోతాయని చెప్పాడు. అలాగే తనకు ఇష్టమైన సహ నటుడు ఎన్టీఆర్‌ అని చెప్పుకొచ్చాడు. అతడు గొప్ప నటుడని, మంచి టీమ్‌మేట్‌ అని చెప్పుకొచ్చాడు. అయితే గతంలో ఎప్పుడూ తారక్‌ గురించి హృతిక్‌ మాట్లాడిన దాఖలాలు లేవు. అందుకే ఆయన ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడాడు అనే డౌటనుమానం వస్తుంది.

ఇదంతా చూస్తున్న ఫ్యాన్స్‌కి ఆనందంగా ఉన్నా.. గతంలో ఇలా ప్రచారంలో స్నేహం చూపించి, తర్వాత పట్టించుకోని హీరోలను గుర్తు చేసుకొని డౌట్స్‌ పడుతున్నారు. కొన్ని ఏళ్ల క్రితం టాలీవుడ్‌లో ఇద్దరు స్టార్‌ హీరోలు ఇలానే స్నేహం చూపించి.. ఆ తర్వాత పెద్దగా స్నేహాన్ని చూపించలేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus