Hrithik Roshan: ఆ విషయంలో హృతిక్ రోషన్ నిజంగా గ్రేట్!

  • August 29, 2022 / 12:55 PM IST

బాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన హృతిక్ రోషన్ కు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన నటనతో హృతిక్ రోషన్ ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. హృతిక్ రోషన్ నటించిన సినిమాలలో సక్సెస్ సాధించిన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే హృతిక్ రోషన్ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారని బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరుంది. హృతిక్ రోషన్ తన నటనతో ఇప్పటివరకు ఏకంగా 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు.

తాజాగా హృతిక్ రోషన్ చేసిన ఒక పని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. హృతిక్ రోషన్ సంస్కారానికి నెటిజన్లు ఆయనను తెగ మెచ్చుకుంటున్నారు. నిరంతరం షూటింగ్ లతో బిజీగా ఉండే హృతిక్ రోషన్ తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొనగా స్టేజ్ పైకి వచ్చిన హృతిక్ రోషన్ ఫ్యాన్ ఒకరు ఆయన కాళ్లకు నమస్కారం చేశారు. ఫ్యాన్ అలా చేయడంతో ఆశ్చర్యానికి గురైన హృతిక్ రోషన్ ఆ తర్వాత మర్యాదపూర్వకంగా అతని కాలును తాకడం గమనార్హం.

వైరల్ అవుతున్న వీడియోను చూసిన నెటిజన్లు సింప్లిసిటీ విషయంలో హృతిక్ రోషన్ ను తెగ మెచ్చుకుంటున్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. హృతిక్ రోషన్ రియల్లీ గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హృతిక్ రోషన్ నటించిన విక్రమ్ వేద సినిమా వచ్చే నెలలో థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ సినిమాతో హృతిక్ రోషన్ ఖాతాలో మరో సక్సెస్ చేరడం గ్యారంటీ అని అభిమానులు భావిస్తున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విక్రమ్ వేద సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలను ఈ సినిమా నెరవేరుస్తుందో లేదో చూడాల్సి ఉంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus