Thagubothu Ramesh: అమ్మను తలచుకుంటూ తాగుబోతు రమేష్ ఎమోషనల్.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ కమెడియన్లలో తాగుబోతు రమేష్ (Thagubothu Ramesh) ఒకరు కాగా అలా మొదలైంది సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఈ నటుడు ప్రస్తుతం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో షోలతో బిజీగా ఉన్నారు. ఒక షోలో తాగుబోతు రమేష్ మాట్లాడుతూ బాల్యంలోనే అమ్మ చనిపోతే జీవితం శూన్యం అని అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. బాల్యంలోనే అమ్మ మరణించారని తాగుబోతు రమేష్ అన్నారు. నేను తాగుబోతులా యాక్ట్ చేయగలుగుతున్నానంటే కూడా అమ్మే కారణమని ఆయన కామెంట్లు చేశారు.

ప్రపంచంలో అమ్మను మించిన నిజాయితీపరురాలు ఉండరని 13 సంవత్సరాల వయస్సులో అమ్మను కోల్పోయానని తాగుబోతు రమేష్ చెప్పుకొచ్చారు. 1995 సంవత్సరంలో రిక్షావోడు సినిమా చూస్తున్న సమయంలో నా ఫ్రెండ్ రవి వచ్చి అమ్మ చనిపోయిందని చెప్పాడని ఆయన కామెంట్లు చేశారు. ఆ సమయంలో లైఫ్ చీకటైపోయినట్టు అనిపించిందని తాగుబోతు రమేష్ పేర్కొన్నారు. తాగుబోతు యాక్టింగ్ చేస్తే ఆ సమయంలో అమ్మ కోసమే చేసినట్టు నేను ఫీలవుతానని ఆయన అన్నారు.

నేను నటుడిని కావడం అమ్మ చూసి ఉంటే బాగుండేదని తాగుబోతు రమేష్ వెల్లడించారు. నాన్న సింగరేణిలో పని చేసేవారని నాన్న తాగితే ఎలా మాట్లాడతారో అమ్మ ముందు యాక్ట్ చేసి చూపించేవాడినని ఆయన అన్నారు. దేవుడు నాకు ఇద్దరు ఆడపిల్లలను ఇచ్చారని తాగుబోతు రమేష్ పేర్కొన్నారు. తాగుబోతు రమేష్ యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.

మంచి ఆఫర్లు వచ్చి ఉంటే ఈ నటుడి రేంజ్ మరింత పెరిగేది బుల్లితెరపై తాగుబోతు రమేష్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బుల్లితెర షోలకు తాగుబోతు రమేష్ పారితోషికం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో తాగుబోతు రమేష్ కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాలి. వెబ్ సిరీస్ లపై కూడా తాగుబోతు రమేష్ ఫోకస్ పెడితే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus