RRR Movie: టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ యాక్షన్ సీన్!

దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో తెలిసిందే. ప్రతీది ఎంతో గ్రాండియర్ గా ఉండేలా చూసుకుంటారు. ‘మగధీర’ సినిమాలో వంద మందితో ఫైట్ సీన్ మొత్తం కథకే హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు అలాంటి ఓ ఫైట్ నే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో పెట్టారట. ‘మగధీర’ సినిమాలో రామ్ చరణ్ వంద మందితో ఫైట్ చేస్తే ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ వందమందితో పోరాడతారట. కథ ప్రకారం సినిమాలో వందమంది బ్రిటీషర్లతో ఎన్టీఆర్ తలపడే సన్నివేశం ఉంది.

ఈ భారీ యాక్షన్ సీన్ మొత్తం సినిమాకి హైలైట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ ఒక్క ఫైట్ కోసం ఏకంగా 20 రోజులు కష్టపడిందట చిత్రబృందం. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఖరీదైన ఎపిసోడ్లలో ఇదే ప్రధమ స్థానంలో నిలవబోతుందని చెబుతున్నారు. అసలే రాజమౌళి తన సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ను ఓ రేంజ్ లో డిజైన్ చేస్తారు. ఈ ఫైట్ ని కూడా అలానే ప్లాన్ చేస్తున్నారు. ఎమోషన్స్ ను కూడా జోడిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు టాలీవుడ్ చరిత్రలో ఇంత కాస్ట్లీ ఫైట్ రాలేదని అంటున్నారు. అభిమానులు ఈ యాక్షన్ సీన్స్ చూసి థ్రిల్ అవుతారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అక్టోబర్ 13న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అఫీషియల్ గా ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ సమయానికి రాదని ఇన్సైడ్ వర్గాల సమాచారం. మరేం జరుగుతుందో చూడాలి!

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus