Jawan: డైరక్టర్‌ పట్టుపట్టారు.. హీరో/నిర్మాత ఓకే అన్నారు.. కట్‌ చేస్తే కోట్లు లాస్‌!

ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో పాట అంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతోంది. సెట్స్‌, టీమ్‌, డ్యాన్సర్లు, అవసరమైతే స్పెషల్‌ సాంగ్‌ హీరోయిన్లు.. ఇలా చాలానే ఖర్చు పెడుతున్నారు. అలాంటి ఓ పాటను అంతా ఓకే అనుకుని, తీసి రిలీజ్‌కి దగ్గరవుతున్న సమయంలో మార్చేశారు అంటే ఆషామాషీ విషయం కాదు. కానీ ఇది జరిగింది అట. అయితే మన దగ్గర కాదు కష్టాల కొలిమిలో కాలిపోతున్న బాలీవుడ్‌లో. అది కూడా ‘జవాన్’ సినిమాలో. ఈ మేరకు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వినవస్తున్నాయి.

‘జవాన్‌’ (Jawan) సినిమా కోసం షారుఖ్‌ ఖాన్‌ – దీపిక పడుకొణె మీద ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉంది. ఇటీవల వచ్చిన ట్రైలర్‌లో కూడా ఆ సాంగ్‌లోని దీపిక గ్లింప్స్‌ను చూడొచ్చు. అయితే ఇప్పుడు ఆ పాటను తొలుత షూట్‌ చేసిన వెర్షన్‌ కాకుండా కొత్త వెర్షన్‌ను రిలీజ్‌ టైమ్‌కి సినిమాలో యాడ్‌ చేస్తున్నారు అంటున్నారు. పాట సెటప్‌ చూస్తుంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు కదా అనే డౌట్ రావొచ్చు. అది డౌట్‌ కాదు నిజమే.

అయితే దీని వెనుక దర్శకుడి అసంతృప్తే కారణం అని అంటున్నారు. ఆ పాటను తొలుత ఫరా ఖాన్‌ కొరియోగ్రఫీలో తెరకెక్కించారట. అయితే అవుట్‌పుట్‌ విషయంలో దర్శకుడు అట్లీ సంతృప్తిగా లేకపోవడంతో మరో వెర్షన్‌ చేద్దాం అనుకున్నారట. దాంతో మరో కొరియోగ్రాఫర్‌ వైభవి మర్చంట్‌తో కొత్త వెర్షన్‌ షూట్‌ చేశారు అని సమాచారం. ఈ మేరకు మళ్లీ షారుఖ్‌, దీపిక కాల్‌షీట్లు తీసుకుని షూట్‌ చేశారట.

మామూలుగా అయితే ఇలాంటి పెద్ద మార్పులకు ఓకే అవ్వరు బాలీవుడ్‌లో. కానీ ‘పఠాన్‌’ జోష్‌లో ఉన్న షారుఖ్‌.. ‘జవాన్‌’తో దానిని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలో ఖర్చు పెరిగినా ఓకే… అంతా పక్కా అనుకున్నాకే ముందుకు వెళ్లాలి అని ఫిక్స్‌ అయ్యారట. దీంతో తన స్నేహితురాలైన ఫరా ఖాన్‌ను ఒప్పించి.. కొత్త వెర్షన్‌ కోసం మరో కొరియోగ్రాఫర్‌తో పాట షూట్‌ చేశారని బాలీవుడ్‌ టాక్‌. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus