Bro Movie: ఆ షాట్ కు ఖర్చుతో ఓ చిన్న సినిమానే తీయవచ్చు అంట!

సాయి ధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో ది అవతార్ చిత్రం రీసెంట్ గానే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపే వసూళ్లతో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రారంభం లో టాక్ కాస్త డివైడ్ గా ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడం తో వసూళ్లు ఊహించిన దానికంటే ఎక్కువే వస్తున్నాయి. సాధారణంగా ఈ చిత్రం పెద్దగా ఆడకపోవచ్చు అని ఫ్యాన్స్ అనుకున్నారు.

ఎందుకంటే ఇది తమిళం లో తెరకెక్కిన ఒక ఓటీటీ చిత్రానికి సంబంధించిన రీమేక్. ఇందులో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోకి సరిపడే యాక్షన్ ఫైట్స్ కానీ , సాంగ్స్ కానీ ఉండవు. అందుకే కలెక్షన్స్ పెద్దగా రావని అందరూ అనుకున్నారు. కానీ పవర్ స్టార్ మాస్ కి అనకాపల్లి నుండి అమెరికా వరకు కళ్ళు చెదిరే ఓపెనింగ్ దక్కింది. ఈ రేంజ్ విద్వంసం అసలు ఊహించలేదని ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఇకపోతే ఈ సినిమాలోని (Bro Movie) ఇంటర్వెల్ బ్లాక్ కి ఫ్యాన్స్ నుండి ఎంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ని వామన అవతారం లో అంతరిక్షం లో భూమి మీద కాలు మోపినట్టు చూపించిన షాట్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మొత్తానికి ఈ ఒక్క షాట్ చాలు, మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కి క్యూ కడతాము అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెట్టడం మన అందరం గమనిస్తూనే ఉన్నాం.

ఈ షాట్ ని చెయ్యడానికి మేకర్స్ 200 కెమెరాలను ఉపయోగించారట. లైటింగ్స్ ని కూడా దానికి తగ్గట్టుగా అమర్చడానికి చాలా ఖర్చు చేసినట్టు సమాచారం. అలా కేవలం ఈ షాట్ మేకింగ్ కోసమే మూడు కోట్ల రూపాయిలు ఖర్చు చేశారట. అభిమానులు జీవితాంతం ఎలేవేషన్స్ వేసుకునే విధమైన షాట్ ఇచ్చాడనే చెప్పాలి డైరెక్టర్ సముద్ర ఖని.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus