బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో మూవీ రెండు షెడ్యూల్స్ హైదరాబాద్ లోనే జరిగాయి. మూడో షెడ్యూల్ దుబాయిలోని అబుదాబి లో పూర్తి అయింది. ప్రభాస్, నీల్ నితిన్ ముఖేష్ , కొంతమంది ఫైటర్స్ పై యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ సీన్ లో హీరోయిన్ శ్రద్ధా కపూర్.. మరో నటి ఎవిలెన్ శర్మ, తమిళ నటుడు అరుణ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. లగ్జరీ కార్లు, బైకులతో ఛేజ్ సీక్వెన్సులు షూట్ చేశారు. ఈ సీన్స్ అద్భుతంగా వచ్చాయని సమాచారం. మరి ఎంత ఖర్చు అయిందో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ముందుగా ఈ సీన్ కోసం ముప్ఫైకోట్లు అనుకున్నారు.
షూటింగ్ కోసం నెల రోజుల పాటు శ్రమిస్తే… షూటింగ్ చేయడానికి ముందు ప్రిపేరేషన్ కోసం వందరోజుల పాటు కష్టపడ్డారు. ఈ భారీ యాక్షన్ కోసమే 28 కార్లు, 5 ట్రక్కులను క్రాష్ చేశారు. తీరా లెక్కలు చూస్తే 70 కోట్లు అయినట్లు తెలిసింది. ఇంత చేసినా ఈ సీన్ సినిమాలో కనిపించేది 8 నిముషాలే. అంటే నిముషానికి ఎనిమిదిన్నర కోట్లు ఖర్చు చేసినట్లు. ఇదివరకు ఏ తెలుగు చిత్రానికి ఇంత భారీ స్థాయిలో ఖర్చుపెట్టలేదు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ టీ సిరీస్ తో కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మూవీ వచ్చే ఏడాది థియేటర్లోకి రానుంది. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.