Nandamuri Kalyan Ram: కళ్యాణ్ రామ్ కొత్త సినిమా షాకింగ్ అప్ డేట్స్ వైరల్.. బడ్జెట్ ఎంతంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక కథలలో నటించడానికి ఆసక్తి చూపే హీరోలలో కళ్యాణ్ రామ్ ముందువరసలో ఉంటారు. తన సినిమాలలో మెజారిటీ సినిమాలకు కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) తనే నిర్మాతగా వ్యవహరిస్తారు. పటాస్ (Pataas) , బింబిసార (Bimbisara) సినిమాలతో భారీ విజయాలను అందుకున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తుండగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. కళ్యాణ్ రామ్ 21వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా విజయశాంతి (Vijayashanthi ) కీలక పాత్రలో నటిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను పెంచింది.

ఈ సినిమా క్లైమాక్స్ కోసం ఏకంగా 8 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ క్లైమాక్స్ సీన్ లో కనిపిస్తారని సమాచారం అందుతోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. దాదాపుగా నెల రోజుల పాటు ఈ క్లైమాక్స్ ను షూట్ చేశారని సమాచారం అందుతోంది. హైదరాబాద్ సమీపంలో భారీ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారని భోగట్టా. కళ్యాణ్ రామ్ ఒకవైపు నటుడిగా, మరోవైపు నిర్మాతగా రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు.

కళ్యాణ్ రామ్ గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమాకు ఎక్కువ మొత్తం ఖర్చైందని బింబిసార సినిమాను మించి ఈ సినిమా కోసం ఖర్చు చేశారని 40 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోందని భోగట్టా. గతేడాది డెవిల్ తో మెప్పించిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.

కళ్యాణ్ రామ్ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండని కళ్యాణ్ రామ్ తన సినిమాల ప్రమోషన్స్ పై మరింత ఎక్కువగా దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus