Kanchana 4: లారెన్స్ ‘కాంచన 4’ – ఈ దెయ్యం చాలా కాస్ట్లీ గురు!

హారర్ కామెడీ జానర్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న రాఘవ లారెన్స్ (Raghava Lawrence), ఇప్పుడు మరోసారి తన కాంచన ఫ్రాంచైజీని కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ముని నుంచి మొదలైన ఈ ప్రయాణం, కాంచన సిరీస్‌తో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వరుస విజయాలు అందుకున్న లారెన్స్, ఈ సారి నాలుగో భాగాన్ని మరింత గ్రాండ్‌గా చేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకే, ఈ సినిమాకు ఏకంగా 70 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం.

Kanchana 4

కాంచన మొదటి భాగాన్ని కేవలం 7 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన లారెన్స్, సిరీస్ వృద్ధి చెందేకొద్దీ బడ్జెట్‌ను భారీగా పెంచాడు. కాంచన 2 (Kanchana 2) కోసం 17 కోట్లు ఖర్చు పెట్టగా, ఆ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే, కాంచన 3 అంచనాలు అందుకోలేకపోయింది. ప్రేక్షకులు రొటీన్ కంటెంట్‌పై ఆసక్తి చూపకపోవడంతో, ఇది ముందున్న సినిమాల స్థాయిలో రన్ కాకపోయినా, లాభాలను మాత్రం తీసుకొచ్చింది. ఇప్పుడు నాలుగో భాగాన్ని అన్ని విధాలుగా కొత్తగా తీర్చిదిద్దాలని లారెన్స్ ఫిక్స్ అయ్యాడు.

ఈసారి కాంచన 4 (Kanchana 4) కేవలం తమిళ్, తెలుగు మాత్రమే కాకుండా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హారర్ సినిమాల్లో టెక్నికల్ అద్భుతాలకు పెద్దపీట వేయాలని అనుకుంటున్న లారెన్స్, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో హాలీవుడ్ స్థాయిలో స్టాండర్డ్స్ అమలు చేయాలని భావిస్తున్నాడట. ఈ సినిమా కేవలం భయపెట్టడమే కాకుండా, మంచి ఎమోషనల్ కంటెంట్ కూడా ఉండేలా ప్లాన్ చేసినట్లు టాక్. ఈ సినిమాకు హీరోయిన్‌గా పూజా హెగ్డే (Pooja Hegde)  ఎంపికైనట్లు తెలుస్తోంది.

ఆమె ఇందులో విలేజ్ యువతిగా నటించనున్నట్లు సమాచారం. కథలో ఆమె పాత్ర చాలా కీలకమైనదని, అంతే కాకుండా హారర్ ఎలిమెంట్స్ మరింత డీప్‌గా అనుభూతి కలిగేలా స్క్రీన్‌ప్లేను డిజైన్ చేసినట్లు ఫిలిం వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే లారెన్స్ చంద్రముఖి 2 (Chandramukhi 2) లాంటి సినిమాతో హారర్ ప్రేక్షకులను ఆకర్షించాడు. కానీ, కాంచన 4 మాత్రం సిరీస్‌లో మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో రూపొందనుందని తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

రాజాసాబ్.. మరి టీజర్ సంగతేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus