ఏ హీరోతో ఏ ప్రాజెక్ట్ మొదలుపెట్టినా… అతని క్రేజ్ ఏంటి… అతని మార్కెట్ ఏంటి… అని ఒకటికి రెండు సార్లు దర్శక నిర్మాతలు చెక్ చేసుకొని రంగంలోకి దిగాలి లేదంటే మొదటికే మోసం వస్తుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఇప్పుడు కొంతమేర బడ్జెట్ ను రికవరీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. థియేట్రికల్ పరంగా కొంత నష్టాలు వచ్చినా… నిర్మాతలను ఆదుకునేవి ఇవే. ఇదిలా ఉంటే… ఇప్పుడు స్టార్ హీరోలు సైతం తమ సినిమాల బడ్జెట్ ను తగ్గించుకోవాలి అని ఎన్నో ప్లాన్ లు వేసుకుంటున్నారు.
లాక్ డౌన్ అవకాశం గా తీసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలి అని భావిస్తున్నారు. అయితే నితిన్ మాత్రం భారీ బడ్జెట్ పెట్టిస్తున్నాడు అని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే… నితిన్, దర్శకుడు కృష్ణ చైతన్య కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతుంది. ‘పవర్ పేట’ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. అయితే ఈ చిత్రానికి 80 కోట్లు బడ్జెట్ అవుతుందట. నితిన్ మార్కెట్ 30 కోట్లు మాత్రమే ఉంది. నాన్ థియేట్రికల్ రైట్స్ కలుపుకుని 40 కోట్లు అనుకోవచ్చు. మరి 80 కోట్లు అంటే డబుల్ బడ్జెట్ పెడుతున్నట్టే.
అయితే ‘పవర్ పేట’ ప్రాజెక్ట్ ను రెండు పార్టులుగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి.. అలా 80 కోట్లు పెట్టాల్సి వస్తుంది. వాస్తవిక సంఘటనలతో కూడుకున్న ఈ చిత్రం 4 గంటల నిడివి వచ్చే ఛాన్స్ ఉందట. అందుకే రెండు పార్ట్ లు ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తుంది. ‘శ్రేష్ట్ మూవీస్’ బ్యానర్ పై నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరో హీరో సత్యదేవ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.