Allu Arjun: పాన్ ఇండియా కోసం బన్నీ ఇలా చేస్తున్నారా?

  • November 5, 2021 / 11:58 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తో తన మార్కెట్ ను ఊహించని స్థాయిలో పెంచుకున్నారు. పుష్ప పార్ట్1తో మరో సక్సెస్ ఖాతాలో చేరుతుందని బన్నీ భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో బన్నీ వరుసగా ప్రీ రిలీజ్ ఈవెంట్లతో పాటు ఇతర ఈవెంట్లలో కూడా పాల్గొంటున్నారు. పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఇతర భాషల్లో కూడా మార్కెట్ పెరిగేలా బన్నీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బన్నీకి ఇప్పటికే మలయాళంలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ అతిథిగా హాజరైన ప్రతి ఈవెంట్ లో పుష్ప సినిమా గురించి మాట్లాడుతుండటం గమనార్హం. తగ్గేదేలే అంటూ డైలాగ్స్ చెబుతూ బన్నీ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు. సినిమా ఫంక్షన్లలో బన్నీ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతూ అన్ని భాషల అభిమానులకు రీచ్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. బన్నీ స్పీచ్ ను కొందరు బాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియాలో కోట్ చేస్తున్నారు.

సుకుమార్ బ్రిలియన్స్ ను పుష్ప సినిమాలో చూస్తారంటూ బన్నీ కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి రిలీజ్ కాబోయే మరో సాంగ్ అంచనాలను మించి ఉండబోతుందని బన్నీ వెల్లడిస్తున్నారు. డిసెంబర్ 17వ తేదీన రిలీజ్ కానున్న పుష్ప పార్ట్1పై బన్నీ అంచనాలను అమాంతం పెంచుతుండగా ఈ సినిమా ఆ అంచనాలకు తగిన విధంగా ఉంటుందో లేదో చూడాల్సి ఉంది. బన్నీ సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ పాన్ ఇండియా హీరోగా ఎదిగేందుకు ఎంతో శ్రమిస్తున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus