‘బిగ్ బాస్4’ టార్గెట్.. 50 మాత్రమే..!

ఉత్తరాదిన ఎంతో పాపులర్ అయిన బిగ్ బాస్.. దక్షిణాదిన కూడా బాగానే పాపులర్ అయ్యింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు కూడా ‘బిగ్ బాస్’ ను బాగా అలవాటు చేసుకున్నారు. సీజన్ 1ను ఎన్టీఆర్ హోస్ట్ చేసి శుభారంభాన్ని అందించాడు. తరువాత రెండో సీజన్ ను నాని, మూడవ సీజన్ ను నాగార్జున హోస్ట్ చేసి.. సక్సెస్ ఫుల్ గా నడిపించారు.దాంతో ఇప్పుడు అందరి ఫోకస్ ‘బిగ్ బాస్4’ పై పడింది.

అయితే మూడు సీజన్ లను వేరే వేరే హీరోలు హోస్ట్ చేస్తూ వచ్చారు కాబట్టి.. ఈసారి కూడా మరో హీరో హోస్ట్ చేస్తాడు అంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్ పేర్లు వినిపించాయి. కానీ సీజన్ 4 ను కూడా నాగార్జునే హోస్ట్ చెయ్యబోతున్నాడు అనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఇక ఈ సీజన్ కు కంటెస్టెంట్ లుగా.. ఆర్యన్ రాజేష్, తాగుబోతు రమేష్, యాంకర్ వర్షిణి, నందు, హేమచంద్ర వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి.

దీని పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ఇదిలా ఉంటే ‘బిగ్ బాస్4’ కు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. ‘బిగ్ బాస్’ మొదటి సీజన్ ను 70 రోజుల పాటు నిర్వహించారు. ఇక రెండో సీజన్, మూడో సీజన్ ను 100 రోజుల పైనే నిర్వహించారు. అయితే ఈసారి .. సీజన్ 4 ను కేవలం 50 రోజుల పాటు మాత్రమే నిర్వహించాలి అని డిసైడ్ అయ్యారట. ఇప్పుడు ఓ మహమ్మారి వైరస్ పుణ్యమా అని వారు ఇలా డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus