Prabhas: సలార్ లో ప్రభాస్ అలా కనిపిస్తారా..?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుసగా కొత్త సినిమాలకు కమిటవుతూ రాబోయే 18 నెలల్లో ఏకంగా మూడు సినిమాలు రిలీజయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మూడు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కాగా పాన్ ఇండియా కథలకు, పాన్ ఇండియా సినిమాలు తీసే సత్తా ఉన్న దర్శకులకు మాత్రమే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం. సలార్ సినిమాలో ప్రభాస్ రెండు భిన్నమైన పాత్రలను పోషిస్తుండగా చిత్ర యూనిట్ ఈ పాత్రల కోసం భారీ మొత్తం ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.

బాహుబలి తరహాలో తండ్రీకొడుకు పాత్రల్లో సలార్ సినిమాలో ప్రభాస్ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. సలార్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని ఈ సినిమాలో ప్రభాస్ హెయిర్ స్టైల్ కోసమే 4 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ప్రభాస్ ను ఫైట్ సీన్స్ లో అద్భుతంగా చూపించాలనే ఉద్దేశంతో నిర్మాతలు ఈ సినిమాకు భారీ మొత్తం ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. శృతిహాసన్ ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.

ప్రభాస్ సినిమాలో రెండు పాత్రలకు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ను ఫాలో అవుతున్నారని సినిమాకు ఇంటర్వెల్ ట్విస్ట్ హైలెట్ కానుందని ప్రచారం జరుగుతోంది. సలార్ మూవీ కేజీఎఫ్ మూవీని మించి ఉండనుందని సమాచారం. ప్రశాంత్ నీల్ సలార్ సినిమా గురించి అప్ డేట్స్ ఇవ్వకపోయినా సినిమాపై అంచనాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus